దేశంలో కరోనా విజృభిస్తున్న సమయంలో ప్రజలు జీవనోపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. మరి కొన్ని కంపెనీలు కూడా అలాగే భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నాయి.

 

 

కష్టకాలంలో మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉందన్నారు. రెనో కంపెనీ తన కార్లపై సూపర్ డిస్కౌంట్ అందిస్తోందన్నారు. ఏకంగా రూ.70,000 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చునన్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బెనిఫిట్, లాయల్టీ బెనిఫిట్ వంటివి కలిసి ఉంటాయన్నారు.

 

 

రెనో డిస్కౌంట్ ఆఫర్ జూలై 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అంతేకాకుండా మూడు నెలల ఈఎంఐ చెల్లించక్కర్లేదన్నారు. దీనికి బై నౌ.. పే లేటర్ స్కీమ్‌ను ఎంచుకోవాలని తెలియజేశారు. అలాగే కారును లోన్ తీసుకొని కొనుగోలు చేయాలని భావిస్తే.. 8.25 శాతం వడ్డీకే రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం తెలిపారు.

 

 

రెనో ట్రైబర్ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమౌతోందన్నారు. ఈ కారుపై రూ.30,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చునన్నారు. ఎక్స్చేంజ్ రూపంలో రూ.20,000, లాయల్టీ బెనిఫిట్ కింద రూ.10,000 ప్రయోజనం లభిస్తుందన్నారు.

 

 

అదే రెనో క్విడ్ కారు ధర రూ.2.92 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. ఈ కారుపై రూ.35,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.10,000. అలాగే ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.15,000. ఇక లాయల్టీ బెనిఫిట్ రూ.10000 ఉంటుందన్నారు.

 

 

చివరిగా రెనో డస్టర్ కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమౌతుందన్నారు. ఈ కారుపై ఏకంగా రూ.70 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.25,000. ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.25,000. ఇక లాయల్టీ బెనిఫిట్ రూ.20,000 ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: