కరోనా వైరస్ వ్యాప్తితో అమెరికా చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో చైనా తీరుపై విమర్శలు చేశారు. చైనా మీద కోపంతో ఉన్న అమెరికా తాజాగా భారత్ తో చైనా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందంటూ వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో చైనా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తోంది. తాజాగా అమెరికా చైనాను నైతికంగా దెబ్బ తీసింది. 
 
సాధారణంగా అమెరికాలో విగ్గుల వినియోగం ఎక్కువ. తాజాగా అమెరికా 13 టన్నుల విగ్గులు, 8 లక్షల డాలర్ల టన్నుల జుట్టును సరిహద్దులో ఆపేసింది. చైనా నుంచి ఆ ఉత్పత్తులు అమెరికాకు వచ్చాయని తెలిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వాటిని రాకుండా ఆపేశారని తెలుస్తోంది. చైనాలో ముస్లింలను నిర్భంధించి వాళ్ల నుంచి బలవంతంగా జుట్టును సేకరించారని అమెరికా ఆ ఉత్పత్తులపై నిషేధం విధించింది. 
 
ముస్లింల నుంచి బలవంతంగా సేకరించిన వెంట్రుకలతో విగ్గులు తయారు చేసి వాటినే అమెరికాలో చైనా అమ్ముతోందని కస్టమ్స్ అధికారులు ఆరోపణలు చేశారు. తాము చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలిందని అమెరికా పేర్కొంది. చైనా క్రూరత్వం, అమానుషత్వంతో వాళ్లను బానిసలుగా చేసుకుని వాళ్లకు సంబంధించిన హక్కులను ఉల్లంఘిస్తూ విగ్గులను తయారు చేస్తున్నారని అమెరికా చైనాపై విమర్శలు చేసింది. 
 
చైనా దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని.... జుట్టు సేకరణలో అమానవీయ పద్ధతులు, అక్రమ పద్ధతులు చోటు చేసుకున్నాయని అమెరికా చెబుతోంది. చైనాలో ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతున్నారని.... 10 లక్షల మంది ప్రజల నుంచి చైనా ఈ విధంగా జుట్టును సేకరిస్తోందని తెలుస్తోంది. దీంతో అమెరికా వీటిపై నిషేధం విధించింది. ఉత్పత్తులపై నిషేధం విధించి అమెరికా చైనాకు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.    
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: