దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కొంత మేరకు అయినా కరొనను అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే లాక్ డౌన్ ప్రభావం పిల్లలపై ఎక్కువగానే చూపుతుంది. లాక్ డౌన్ విధించిన దగ్గర నుండి పిల్లలు స్మార్ట్ ఫోన్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు. పీడియాట్రిక్స్ విభాగం మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ గుప్తా ఈ సర్వే చేపట్టారు. ఆయన నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని డాక్టర్ రమేశ్ ‌చౌదరి, డాక్టర్ ధన్‌ రాజ్‌ బాగ్రి, డాక్టర్ కమలేశ్‌ అగర్వాల్, డాక్టర్ వివేక్ అత్వానీ, డాక్టర్ అనిల్‌శర్మ నిర్వహించారు.


 

చాలా పాఠశాలలు, సగటున రోజుకు 1-8 గంటలు ఆన్‌లైన్ తరగతుల్లో పిల్లలను నిమగ్నం చేస్తున్నాయని తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు  పిల్లలు స్క్రీన్‌ చూసే సమయాన్ని పెంచారన్నారు. శారీరక శ్రమను తగ్గించారని సర్వేలో తేలిందని తెలియజేశారు. దీంతో 50 శాతం మంది పిల్లలు 20 నుంచి 60 నిమిషాలు పడుకున్న తర్వాత నిద్రించేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. 17 శాతం మంది పిల్లలు రాత్రి నిద్రలోనుంచి లేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.  అయితే వారిలో తలనొప్పి, చిరాకు, బరువు పెరగడం, శరీరం, వెన్నునొప్పిలో మార్పు, మరుగుదొడ్డి అలవాట్లలో చేంజ్‌ కనిపిస్తున్నాయని గుర్తించారని తెలియజేశారు.

 


మూడింట రెండొంతుల మంది పిల్లల్లో ప్రవర్తనా మార్పులు కనిపిస్తున్నట్లు తేల్చారు.  దీంతో పాటు ఆన్‌లైన్ తరగతుల డిమాండ్‌ను తీర్చేందుకు సుమారు 38 శాతం కుటుంబాలు కొత్త పరికరాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది వారిపై కొంత ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. కొవిడ్‌, లాక్‌డౌన్‌ పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు సర్వేలో వెల్లడైందన్నారు. ఇప్పటికైనా పిల్లల స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ సమయాన్ని తగ్గించకుంటే భవిష్యత్తులో పిల్లలు అతిపెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు ముందస్తుగా హెచ్చరికాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: