కరోనా వైరస్ ప్రభావం తో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా భయాందోళనలతో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కేసులు పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. బయటకు రావాలంటేనే జనాలు బెంబేలెత్తి పోయే పరిస్థితి . వచ్చిన వారు సురక్షితంగా వైరస్ బారిన పడకుండా వెళ్తారా అంటే అది డౌటే. మొన్నటి వరకు లక్షణాలు కనిపించినా, నా కొత్త రకం వైరస్ మాత్రం లక్షణాలు లేకుండానే జనాలకి సోకుతూ మరింత ఆందోళన పెంచుతోంది. అసలు ఈ వైరస్ ఎప్పటికి ఎంత అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. 
 
 
తాజాగా అంటువ్యాధుల నిపుణులు చెబుతున్న ఈ మాటలు వింటుంటే మరింత ఆందోళన పెరుగుతుంది. రెండోదశ కరోనా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో అది అంతగా భయపడాల్సిన పని లేదని, చాలామంది చెబుతున్నారు. అందులో నిజం లేదని, రెండోదశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయమంటూ మెడికల్ జర్నల్ లాన్సె ట్ హెచ్చరించింది. రెండో దశ దక్షిణాఫ్రికా అమెరికా మధ్య ఎక్కువగా ఉందని, ఈ వైరస్ ఇప్పటికే వేగంగా వ్యాప్తి చెందుతుందని, త్వరలో ఇది మరింత ఘోరంగా మారిపోతుందని, ఇంకా ఎక్కువ సంఖ్యలో జనాలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని,  లాన్సెట్ అధ్యయనంలో తేలిందట. 
 
 
వందేళ్ల క్రితం ప్రపంచాన్ని స్పానిష్ ఫ్లూ ఏ విధంగా అయితే గడగడలాడించిందో ఇప్పుడు అదే విధంగా ఈ వైరస్ విస్తరించి పోతుందని హెచ్చరించింది. ఈ కొత్తరకం వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని, జలుబు, జ్వరం , దగ్గు వంటి లక్షణాలు కనబడే వరకు అలక్ష్యం వహించ వద్దని, కండరాల నొప్పి, అలసట, విరేచనాలు వంటి లక్షణాలు కనబడిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరించింది.కరోనా బారిన పడిన వ్యక్తులు సాధ్యమైనంతవరకు ఐసోలేషన్ అవ్వడం వల్ల ఇతరులకు వ్యాప్తి చేయకుండా ఉండగలరని, ఎంత త్వరగా వైరస్ ను గుర్తించి చికిత్స తీసుకుంటే అంత మంచిదని చెబుతోంది. లాక్ డౌన్ విధించడం వల్ల ఉపయోగం లేదని , సామూహికంగా పరీక్షలు నిర్వహించి వ్యాధి గ్రస్తులను గుర్తించి వారి ని ఐసోలేషన్ చేయడమే సరైన మార్గమని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: