తెలుగు దేశం నాయకులు ఇప్పుడు వరుస అరెస్టులతో బెంబేలెత్తుతున్నారు. మొన్న అచ్చెన్నాయుడు, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇవాళ కొల్లు రవీంద్ర.. ఇక ముందు ఇంకెంత మంది నేతలు జైలుపాలవుతారో అన్న ఆందోళన వారిలో నెలకొంటోంది. అయితే జగన్ సర్కారు ఎత్తుగడలను తెలుగు దేశం పార్టీ ఎదుర్కొనేందుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది.

 

 

అయితే.. జగన్ సర్కారు కావాలనే శక్తివంతులైన బీసీ నేతలపై దాడి చేస్తోందన్న వాదనను తెలుగు దేశం అధినేత చంద్రబాబు తెరపైకి తీసుకొస్తున్నారు. అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన రోజు నుంచే ఈ వాదన తెరపైకి తెచ్చారు. బీసీలను ఎదగనీయరా.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మధ్య రెడ్డి కులస్తుడైన జేసీ ప్రభాకర్ రెడ్డిని జైలుపాలు చేయడంతో ఈ ఆరోపణల్లో కాస్త పవర్ తగ్గింది.

 

 

మళ్లీ ఇప్పుడు కొల్లు రవీంద్రను హత్యకేసులో అరెస్టు చేయడంతో మరోసారి టీడీపీ బీసీ రాగం అందుకుంది. అయితే... ఇక్కడే టీడీపీ నేతలు ఓ లాజిక్ మర్చిపోతున్నారు. అదేంటంటే.. మిగిలిన కేసుల్లో ఏదైనా ఆరోపణలు చేసినా కాస్త పరవాలేదు. కానీ ఇక్కడ కొల్లు రవీంద్ర అరెస్టు అయ్యింది ఓ హత్య కేసులో .. అందులోనూ హత్య కాబడిన నాయకుడు కూడా బీసీ వ్యక్తే.

 

 

మరి అన్యాయంగా బీసీ నాయకుడైన కొల్లు రవీంద్రను కేసులో ఇరికిస్తున్నారని వాదిస్తున్న టీడీపీ నాయకులు... చనిపోయిన వ్యక్తి బీసీ కదా మరి.. ఆ సంగతేంటన్న ఆలోచనలేకుండానే వాదిస్తున్నారా.. అంతే కాదు.. హత్యకు గురైన భాస్కర రావు బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీలు ధర్నాలు చేస్తున్నారు కదా.. మరి వారికి న్యాయం దక్కాల్సిన అవసరం లేదా.. ఇవీ ఇప్పుడు తెలుగు దేశం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: