దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసులసంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం పెను సంక్షోభంలోకి కూరుకుపోతోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ పెను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. 
 
దేశమంతా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా లాభాలు వచ్చేవి. కానీ రానురాను ఈ రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు సామాన్య, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉన్న స్థలాలు నేడు ఎగువ మధ్య తరగతికి చెందిన వాళ్లు మాత్రమే కొనగలిగే స్థాయిలో ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు బ్యాంక్ లోనులు తీసుకుని స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. 
 
నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంలో వచ్చిన ఇబ్బందుల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. హైదరాబాద్ లో భూముల విలువ పడిపొగా అమరావతిలో విలువ పెరిగింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో భూముల విలువ పడిపోతూ వచ్చింది. అక్కడ భూముల రేటు అంతకంతకూ తగ్గుతోందే తప్ప పెరగడం లేదు. 
 
చాలామంది కరోనా సంక్షోభం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో రియల్ రంగానికి దెబ్బ పడింది. ఇదే సమయంలో ఏపీలో ఇసుక కొరత వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల భవన నిర్మాణ యజమానులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ధరలు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తే కొనుగోళ్లు సాధ్యం అవుతాయి.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: