తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెంది ఉంది అని అందరికీ తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాజకీయ నాయకులకు వైద్యులకు, పోలీసులకు కూడా కరోనా రావటం సామాన్య జనులలో భయాందోళనలు కలిగించే విధంగా పరిస్థితి మారింది. ఇదిలా ఉండగా కొడుకు పుట్టాడు అని హైదరాబాద్ నగరంలో ఓ కానిస్టేబుల్ స్వీట్లు పంచాడు. సోదరుడితో కలిసి 12 మందికి కొడుకు పుట్టాడన ఆనందంలో స్వీట్లు పంచడం తో ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ కి కరోనా  ఉందని తేలడంతో స్వీట్లు తిన్నవారు అంతా క్వారంటైన్ కి తరలించడం జరిగింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఆ కానిస్టేబుల్ వల్ల 12 మందికి కరోనా సోకినట్లు ఫలితాలలో తేలింది.

 

కానిస్టేబుల్ సోదరుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ పరిణామంతో స్వీట్లు తిన్న కుటుంబాల్లో టెన్షన్ మొదలైంది. మొత్తం మీద కొడుకు పుట్టాడని ఆనందంలో స్వీట్లు పంచడంతోపాటు ఆ కానిస్టేబుల్ కరోనా అంటించడం మిగతా కుటుంబాల్లో ఆందోళనకు కారణమైంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో కరోనా తీవ్రత ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో అరికట్టడానికి ప్రభుత్వాలు టెస్టింగ్ సామర్థ్యం పెద్ద ఎత్తున పెంచుకోవటానికి భారీ స్థాయిలో టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

 

మరోపక్క హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ లో కరోనా వ్యాధి గ్రస్తులను సరైన రీతిలో పట్టించుకోకుండా వైద్యులు వదిలేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో కనీసం కరోనా రోగులకు పడకలు కూడా కేటాయించకుండా...నేల మీద వారిని కూర్చోబెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దీంతో ఇది చూసి చాలా మంది తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ తేలితే అదే విధంగా ట్రీట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: