కాపు రిజర్వేషన్ అంశంలో జగన్ సర్కార్ న్యాయం చేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వైయస్సార్ కాపు కార్పొరేషన్ పేరిట వైయస్ జగన్ చాలావరకూ కాపులకు నిధులు కేటాయించి అనేక సమస్యలు తీర్చటం తో గతంలో కాపు రిజర్వేషన్ ల కోసం ఉద్యమం చేసిన టైములో పార్టీ తరుపున్న మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పుకొచ్చారు. గతంలో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ఆ తర్వాత హౌస్ అరెస్ట్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రజంట్ కాపులకు సీఎం జగన్ మంచి పనులు చేస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్ అంశంలో ప్రధాని మోడీ తో చర్చించి సమస్య తీర్చే విధంగా జగన్ చొరవ తీసుకోవాలని ఇటీవల ముద్రగడ లెటర్ రాయడం జరిగింది.

 

మరోపక్క ఇదే తరుణంలో పవన్... వైఎస్ జగన్ కరోనా కట్టడి చేయడంలో మరియు ఆంబులెన్స్ లు ప్రారంభించిన తరుణంలో సోషల్ మీడియాలో పొగడటం జరిగింది. దీంతో  ఎప్పుడు విమర్శించే పవన్ కళ్యాణ్...జగన్ ని పొగడటం వెనకాల రాజకీయ ఎత్తుగడ ఉందన్న వార్తలు వస్తున్నాయి. వినబడుతున్న వార్తల ప్రకారం న్యూట్రల్ ఓటర్లను అదేవిధంగా ఇటీవల కాపులను ఆకర్షించే విధంగా జగన్ మంచి పనులు చేయటంతో ఇలాంటి సమయంలో కనీసం ప్రశ్నించకపోతే ఎప్పుడూ జగన్ ని విమర్శించే నేతగా రాజకీయాల్లో మిగిలి పోతానేమో అన్న భావనతో పవన్ కళ్యాణ్ జగన్ ని పొగిడినటు మేధావులు తెలుపుతున్నారు. మరోపక్క కాపుల రిజర్వేషన్ అంశం గురించి కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత జగన్ సర్కార్ ని ప్రశ్నించడం జరిగింది.

 

కాగా ఇదే సమయంలో ముద్రగడ కూడా  ప్రశ్నించడంతో… కాపు రిజర్వేషన్ అంశం విషయంలో ముద్రగడ మరియు పవన్ కళ్యాణ్ కలిసి రాబోయే భవిష్యత్తు రాజకీయాలు చేస్తారేమో అన్న రాజకీయ చర్చ ఏపీలో గట్టిగా నడుస్తోంది. ఖచ్చితంగా అయితే చాలా మంది మేధావులు అంటున్న ప్రకారం ముద్రగడ పద్మనాభం మరియు పవన్ కళ్యాణ్ కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు. కారణం ముందు నుండి ముద్రగడ పద్మనాభం దృష్టిలో పవన్ కళ్యాణ్... చంద్రబాబు పార్ట్నర్ గానే ముద్ర పడిన సందర్భాలు ఉన్నాయని… కాపుల కోసం తానూ పోరాటం చేసిన సమయంలో కనీసం మద్దతు కూడా రాలేదని, ఇందువల్ల ముద్రగడ చాలావరకూ పవన్ కళ్యాణ్ తో  కాపు రిజర్వేషన్ అంశం గురించి కలిసి పోరాడే పరిస్థితి మాత్రం ఉండదని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: