చైనా సైనికులు గాల్వాన్ లోయలో  భారత సైనికుల పై దాడి చేసి 20 మంది సైనికుల మరణానికి కారణం అవ్వటంతో  భారత్ చైనా పై ప్రతీకారం తీర్చుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎదురుదెబ్బ తగిలిన శత్రువు ధైర్యంగా నిలబడితే  చూసి భయంతో వనకడం  ఎలా ఉంటుంది అన్నది తాజాగా చైనా చూసింది. అయితే భారత్ అంటే చైనా కి భయం ఏర్పడినప్పటికీ చైనాలో  మాత్రం అహం తగ్గించు కోవడం లేదు. 

 


అయితే ఇప్పుడు వరకు చైనా తనది అనుకున్న భూభాగం వివాదం లోనైనా ఉంది లేదా చైనా చేతిలోనే ఉంది కానీ మొదటిసారి భారత సైన్యం దెబ్బకి... భారత భూభాగాన్ని మాత్రం కదిలించ లేకపోయింది చైనా. దీంతో భారత్ పై ఏదో ఒకటి చేయాలి అని అటువంటి స్థితిలో ఉంది చైనా. అయితే సరిహద్దు నుంచి వెనక్కి వెళ్తే ఎంతో  అవమానకరం అని చైనా సైనికులో ఓ భావన వ్యాప్తి చేసేలా  చేయడానికి ఒక ప్రయత్నం చేస్తోంది చైనా. అయితే ప్రస్తుతం వివాదం ఉన్న ప్రాంతంలో కాకుండా... ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రాంతాల్లో  చైనా సైన్యం కదలికలు కనబడుతున్నాయి అన్నది తాజా సమాచారం. 

 

 ఇలా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం సరిహద్దుల్లో  వెనక్కి వెళ్లి ప్రస్తుతం ఈ కొత్త రూట్లలో చైనా సరికొత్త వ్యూహం తో నాటకాలు మొదలు పెట్టింది అన్నది ప్రస్తుతం అర్థం అవుతుంది. దీనిని భారత సైనిక దళాలు కనిపెట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు, అయితే భారత బలగాలు  మూడున్నర కిలోమీటర్ల మీద ఎంతో బలంగా ఉన్నాయి,  తక్కువ సైన్యం ఉన్న ఏరియా లో కి వెళ్లి వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది చైనా. ఇలా చైనా తీరుకు  భారత్ సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధం అయింది. అయితే ఇలా ప్రపంచంలోని రెండు  అతిపెద్ద సైన్యం కలిగిన దేశాలు యుద్దానికి సిద్ధం అవుతున్న వేళ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని ఊహకందని విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: