కరోనా వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన రోజు నుండి డ్రాగన్ కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. చైనాకు ప్రపంచ దేశాలు వరుస షాకులిస్తున్నాయి. కరోనా గురించి దృష్టి మరలించటానికి చైనా భారత్ సరిహద్దు భూభాగాలను ఆక్రమించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే భారత సైనికుల సత్తాచూసి చైనా ఏం చేయాలో పాలు పోని స్థితిలో ఉంది. మోదీ చైనాకు ప్రత్యక్షంగా సవాల్ విసురుతున్నారు. 
 
యాప్ ల నిషేధం, ప్రాజెక్టుల రద్దు లాంటి అంశాలు చైనాను ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయి. చైనాలో ఎదురవుతున్న సంక్షోభం కూడా ఆ దేశాన్ని ఇబ్బందులు పెడుతోంది. గతంతో పోలిస్తే ఎగుమతులు భారీగా తగ్గాయి. తాజాగా చైనాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన త్రీగార్జెస్ డ్యామ్ కూలిపోయే స్థితిలో ఉందని తెలుస్తోంది. మధ్య చైనాలోని హుబేయ్ ఫ్రావిన్స్ లో యాంగ్జీ నదిపై త్రీగార్జెస్ డ్యామ్ ను నిర్మించారు. 
 
చైనా 1992 లో ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చింది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కోసం 8.5 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని చైనా అంచనా వేసింది. ఈ నిర్మాణం వల్ల చైనా 13 లక్షల మందికి పునరావాసం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2006లో ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి 37 బిలియన్ డాలర్లు ఖర్చైంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ కేంద్రంగా ఈ డ్యామ్ కు గుర్తింపు వచ్చింది. 
 
కానీ గత కొన్ని రోజుల నుంచి త్రీగార్జెస్ డ్యామ్ ఉన్న ప్రాంతంలో పడుతున్న వర్షాల వల్ల డ్యామ్ ఆకారం దెబ్బ తింటోంది. శాటిలైట్ చిత్రాల్లో ప్రాజెక్ట్ గోడలు వంకరగా కనిపిస్తున్నాయి. నాసిరకం స్టీల్, సిమెంట్ వాడకాలు, నిర్మాణ లోపాలు డ్యామ్ కూలిపోవడానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది. డ్యామ్ లెఫ్ట్ కెనాల్ లో భూమి దెబ్బ తింటోందని... ఈ డ్యామ్ కూలిపోతే 40 కోట్ల మందిపై ఈ ప్రభావం పడుతుందని.... చైనాకు భారీ నష్టం వాటిల్లనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: