ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణ రాష్ట్రంలో సమానంగా  కరోనా  వైరస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వందల్లో కేసులు నమోదు అవుతుంటే తెలంగాణలో వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నుంచి అతి ఎక్కువ కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి మొన్నటివరకు కరోనా వైరస్ పరీక్షల విషయంలో విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పరీక్షల సంఖ్యను పెంచింది. 

 

 అయితే నిన్న ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38, 998 టెస్టులు నిర్వహించారు. ఇది దేశంలోనే రికార్డు అని చెప్పవచ్చు. 38 వేలకు పైగా కరోనా  టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 800కు పైగా వచ్చింది. ఇక తెలంగాణలో 5356 పరీక్షలు నిర్వహించగా  పాజిటివ్ కేసుల సంఖ్య.. 1213 వచ్చింది. వీటిలో ఒక జిహెచ్ఎంసి పరిధిలోనే 900 ఎన్ని కేసులు నమోదవ్వటం సంచలంగా  మారిపోయింది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య పబ్లిక్ లో  భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పాలి. 

 

 అయితే ప్రస్తుతం లెక్కలో  తెలుసుకున్నది ఏమిటంటే.. దేశవ్యాప్తంగా లెక్కన చూసుకుంటే పాజిటివ్ కేసులు సంఖ్యలో  మొదటి స్థానానికి చేరింది తెలంగాణ.  తెలంగాణలోని కరోనా  పాజిటివ్ కేసుల శాతం . తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం టెస్టులు 98150..టెస్టులు చేయగా  కేసులు 18573 నమోదయ్యాయి.. అంటే ఏకంగా తెలంగాణలో పాజిటివ్ కేసులు  18 శాతంతో  దేశంలోనే మొదటిస్థానంలో ఉంది తెలంగాణ. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... పాసిటివ్  కేసులో శాతం 1.7 తో చివరి స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: