అప్పుడే అమరావతి పేరుతో కొంతమంది రాజధాని పరిసరప్రాంత ప్రజలు చేపట్టిన సమ్మె అప్పుడే  200 రోజులకు చేరిపోయింది. ఇక ఈ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని, ప్రజలు దీన్ని ముందుకు నడిపిస్తారని, చంద్రబాబు కాస్త గట్టిగానే చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈ వ్యవహారంలో కి చంద్రబాబు తెలివిగా లాగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు సంఘీభావం తెలిపిన సందర్భంగా, గతంలో అమరావతి గురించి చెప్పిన మాటలతో పాటు, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రస్తావించారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని, పార్లమెంట్ ఆవరణలో మట్టి తీసుకువచ్చి మరీ అండగా ఉంటామని చెప్పిన విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అందుకే అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందంటూ ఈ వ్యవహారాన్ని మోదీకి తగిలించే ప్రయత్నం చంద్రబాబు చేశారు.

 

IHG

అమరావతి ని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులకు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే, మెల్లిగా అమరావతి  అంటే మోదీకి ఎక్కడలేని ప్రేమ ఉందని, కానీ ఆ ప్రేమను జగన్ తుంచి వేయాలని చూస్తున్నారని, అప్పట్లో మోదీ ఇచ్చిన హామీలను జగన్ నెరవేరకుండా చేస్తున్నారని, చంద్రబాబు ఇప్పుడు బీజేపీ శ్రేణులను సైతం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్ల కనిపిస్తోంది.

IHG

 

అసలు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను అమలు కాకుండా వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కాబట్టి ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ కలగజేసుకుని, అమరావతి కి న్యాయం చేయాలని , ఆ బాధ్యత, బరువు మొత్తం మోదీ మీదే ఉందని బాబు చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు బాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, అమరావతిని ఏదో రకంగా మోదీ కోర్టులోకి గెంటి వేసి వైసీపీపై బీజేపీని ఉసిగొల్పాలనే ప్లాన్ లో బాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: