భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనడానికి  ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ  ఒక్కటి కూడా సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ కు నివారణ ఒక్కటే మార్గం గా మారిపోయింది. ఇక రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో  దేశ ప్రజానీకం  మొత్తం భయంతో వణికిపోతున్న వేళ భారత్ బయోటెక్ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కు వాక్సిన్  కనుగొన్నామని దీనికి ట్రయల్స్  నిర్వహించి  ఆగస్టు నెలలో అందుబాటులోకి తీసుకు వస్తాము అంటూ ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ తెలిపింది. 

 

 ఈ నేపథ్యంలో భారత ప్రజానీకం మొత్తంలో సరికొత్త ఊపిరి నిండిపోయింది అని చెప్పాలి. ఈ ప్రకటనతో కరోనా  వైరస్ ను అంతం చేయవచ్చు అనే ఒక పాసిటివిటి  వచ్చింది భారత ప్రజల్లో. అయితే తాజాగా కొంతమంది వైద్యులు మాత్రం కరోనా వైరస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ సంయుక్తంగా దేశీయ ఇండోజినిక్  అనే కరోనా  వ్యాక్సిన్ ఆగస్టు 14వ తేదీన వస్తుంది అని ప్రకటించారు. అయితే ఇది సాధ్యమేనా అంటూ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. 

 


 కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరపడానికి ఏకంగా 18 నెలల సమయం పడుతుందని కానీ కేవలం మూడు నెలల వ్యవధిలోనే కరోనా  వ్యాక్సిన్  ఎలా అందుబాటులోకి తెస్తామంటున్నారు అని  ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై దేశ ప్రజానీకం మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా  వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు., ఈ నేపథ్యంలో రెండు నెలల్లో వచ్చిన మూడు నెలల్లో వచ్చిన ఏదో ఒక వాక్సిన్  అందుబాటులోకి వస్తోంది. ఇది  సత్ఫలితాలను ఇస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. అలాంటి దాన్ని సపోర్ట్ చేయడం మానేసి మన భారతదేశపు వ్యాక్సిన్ పైన మనమే విమర్శలు చేస్తే ప్రపంచ దేశాల ముందు చులకనగా అయిపోతాము అని అంటున్నారు భారత ప్రజానీకం.

మరింత సమాచారం తెలుసుకోండి: