ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌వ్వింపు చ‌ర్య‌లకు, ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రికి మారుపేరైనా చైనాకు షాకిచ్చేలా ఆ దేశానికి చెందిన యాప్‌ల‌పై నిషేధం విధించారు. ఈ నిర్ణ‌యాన్ని ఎంద‌రో అభినందిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు ప్ర‌ధాని. దేశాన్ని డిజిటల్‌ వైపు స్వావలంబనగా మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరో అడుగు ముందుకు వేసి 'స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్' ను ప్రారంభించారు.

 

కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ భాగస్వామ్యంతో ఈ ఛాలెంజ్‌ను నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఈ ఛాలెంజ్‌లో ప్రజలకు రూ.20 లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఛాలెంజ్ గురించి ప్రధాని మోదీ స్వయంగా తన సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ సవాలు ఫొటో ఎడిటింగ్ నుంచి గేమింగ్ యాప్స్‌ వరకు సవాళ్లతో పాటు విభిన్న వర్గాలుగా విభజించారు. 'స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్'లో పాల్గొనాలనుకొనేవారు ఇన్నోవేట్.మిగోవ్.ఇన్ వెబ్‌సైట్‌ సందర్శించి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో పేర్ల నమోదుకు గడువు తేదీ 18 జూలై. ఈ ప్రక్రియ జూలై 20 నుంచి 24 వరకు కొనసాగుతుంది. జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జ్యూరీ పరిశీలించి బహుమతి గ్రహీతలను ఎంపిక చేస్తుంది. ఛాలెంజ్ కింద గరిష్టంగా రూ.20 లక్షల వరకు బహుమతులు గెలిచే అవకాశం ఉన్నది.

 

'స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్'లో ప్రజలు మొబైల్ గేమ్స్, సోషల్ మీడియా. ఫొటో-వీడియో ఎడిటింగ్ యాప్స్‌ సృష్టించాలి. ఈ యాప్స్‌కు 'మేక్ ఇన్ ఇండియా ఫర్ ఇండియా అండ్ ది వరల్డ్' అనే మంత్రాన్ని జోడించారు. అలాగే, మేక్ ఇన్ ఇండియా యాప్స్‌ రూపొందించడానికి ప్రజలను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: