కర్ణాటక రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. గడచిన 15 రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అమాంతంగా పెరిగి పోతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీనితో ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. బెంగళూర్ నగరం మొత్తం కూడా నిర్మానుషంగా మారింది. ఇక తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

 




గడిచిన 24 గంటలను రాష్ట్రంలో కొత్తగా 1839 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 21549 కు చేరుకుంది. నేడు ఒక్కరోజే కరోనా వైరస్ బారి నుండి రాష్ట్రంలో  439 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9244 మంది పూర్తి ఆరోగ్యంతో వాళ్ల ఇళ్లకు డిశ్చార్జ్ అయ్యారు. ​ఇది ఇలా ఉండగా మరో వైపు  నేడు ఒక్కరోజే రాష్ట్రంలో 45 మళ్లీ కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 335 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ఇక 226 మంది కి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో వారిని ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ 11966 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్నాయి. నేడు ఒక్కరోజే బెంగళూరు నగరంలో 1172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: