కరోనా కట్టడి విషయంలో మొన్నటి వరకు మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినా కేరళలో ప్రస్తుతం రోజు రోజుకి పరిస్థితి చేయిదాటిపోతున్నట్లే కనిపిస్తుంది. లాక్ డౌన్ 4వరకు రాష్ట్రంలో రోజుకు10-20 మాత్రమే కేసులు నమోదు కాగా లాక్ డౌన్ 5లో ఆసంఖ్య 100 దాటింది. ఇక ఇప్పుడు 200 దాటింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా  211 కేసులు నమోదు కాగా ఈరోజు రికార్డు స్థాయిలో 240 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5204కు చేరగా అందులో ప్రస్తుతం 2129కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 3048మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 25 మంది మరణించారు.    
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈఒక్క రోజే 4280 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 107001కు చేరింది అలాగే కర్ణాటకలో ఈరోజు ఏకంగా 1839కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 21549కి చేరింది.
 
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 765కేసులు నమోదు కాగా తెలంగాణలోనైతే 1850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 672000కరోనా కేసులు నమోదుకాగా 19000మరణాలు చోటుచేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: