అమరావతి రాజధాని అని చంద్రబాబు నిర్ణయించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆ తరువాత కధ మొత్తం రాజధాని మీద మరకలు జల్లేసింది. ఇన్సైడెర్ ట్రేడింగ్ జరిగింది అని జగన్ విపక్షంలో ఉన్నపుడు ఆరోపణలు చేశారు. ఇపుడు ఆయనే అధికారంలోకి వచ్చారు. ఇక జగన్ ఆరు నెలలు మౌనంగా ఉండి ఆ తరువాత మూడు రాజధానుల కాన్సెప్ట్ ని ముందుకు తెచ్చారు.

 

విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, లా కాపిటల్ గా కర్నూల్ ని అమరావతిని లెజిస్లేచర్ కాపిటల్ గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. శాసనమండలిలో మాత్రం అది ఆమోదానికి నోచుకోలేదు. ఇక రెండవమారు తాజాగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా కూడా అసలు మండలిలో ప్రవేశపెట్టకుండానే వాయిదా వేశారు.

 

ఈ నేపధ్యంలో బిల్లు ఆటోమేటిక్ గా బిల్లు పాస్ అయిపోతుందని, ఇక గవర్నర్ ఆమఒదంతో చట్టం అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని రైతుల ఆందోళన 200 రోజులకు చేరుకుంది. మరో వైపు ఒక్కటే రాజధాని ఉండాలని, అమరావతిని కదల్చవద్దని మరో మారు తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసింది. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ పునరలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.

 

ఓ వైపు కరోనా మహమ్మారి ఉంది. విశాఖ రాజధాని చేయాలనుకున్నా కూడా కుదిరే వ్యవహారంగా లేదు. అదే సమయంలో తరలింపునకు వేలాదిగా నిధులు అవసరం అవుతాయి. ఇంకో వైపు రైతుల ఆందోళనను ద్రుష్టిలో ఉంచుకుని అమరావతిని అభివ్రుధ్ధి చేయాలని వైసీపీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

 

ఎంత కాదనుకున్నా కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గేట్లు లేదు. అది తగ్గినా మరో రెండేళ్ల పాటు ఆర్ధికంగా కోలుకోవడానికి కష్టం అవుతుంది. అప్పటికి సార్వత్రిక  ఎన్నికలు దగ్గరపడతాయి. అందువల్ల జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనలు ప్రస్తుతానికి విరమించుకుని అమరావతిని అభివ్రుధ్ధి చేయాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం రైతుల పోరాటానికి విజయం దక్కినట్లే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: