తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా బారిన రాజకీయ నాయకులు మరియు పోలీసులు అదేవిధంగా చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా పడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ నగరాని మరొకసారి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ లో ఉంచాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ భయాన్ని నగరంలో బ్యూటీ పార్లర్ లు క్యాష్ చేసుకుంటున్నట్లు సమాచారం. బ్యూటీ పార్లర్ లను ఐసోలేషన్ సెంటర్ లగా మార్చేసి నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారట. నిబంధనలను తుంగలో తొక్కి కరోనా రోగులకు గదులను అద్దెకు ఇస్తున్నారట.

 

పైగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా కరోనా పాజిటివ్ వ్యక్తులకు రెంట్ కి ఇస్తున్నారట. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ బ్యూటీ పార్లర్ లో కరోనా బాధితులకు ఐసోలేషన్ సెంటర్ గా మారిపోయింది. అంతేకాకుండా కరోనా రోగి దగ్గర రోజుకి పది వేల ఫీజు బ్యూటీ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మరియు నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్వాహకులు కరోనా రోగులకు గదులను అద్దెకు ఇస్తున్నారట. హైదరాబాద్ నగరంలో భయంకరంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్న తరుణంలో ఈ విధంగా బ్యూటీ పార్లర్ నిర్వాహకులు నిర్వర్తించడం ఆందోళనకరంగా మారింది. జనాల భయాలను దందా గా మార్చుకుని డబ్బులు సంపాదించుకోవటం పై చాలా మంది ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

 

అసలు ఇలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోదా అని అంటున్నారు. కరోనా వైరస్ రోగులకు ఆశ్రయం కల్పించకపోతే… ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా అయితే వైరస్ హైదరాబాద్ నగరంలో అరికట్టడం కష్టమని మరి కొంతమంది అంటున్నారు. వెంటనే హైదరాబాద్ నగరంలో కరోనా రోగులకు ఆశ్రయం కల్పిస్తున్న బ్యూటీపార్లర్ లపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: