అప్పట్లో ఎగిసిపడిన కాపు ఉద్యమం ఆ తరువాత తరువాత చల్లారిపోయింది. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తూ, టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీని నెరవేరుస్తూ అని అంతా భావించినా, చంద్రబాబు ఆ ఊసే ఎత్తుకుపోవడంతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఉద్యమం మొదలైంది. ఆ సందర్భంగా ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి. చివరికి తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనమయ్యే వరకు పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారంలో ముద్రగడ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం చాలా అవమానాలకు గురి చేసింది. చాలా కాలం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు.. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద కాక రేపింది.

 

IHG's Kapu quota conundrum ...

 

ఆ తరువాత 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్, కాపు రిజర్వేషన్ అంశంపై స్పందించారు. చంద్రబాబులా నేను అబద్దాలు చెప్పానని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అని, ముద్రగడ పద్మనాభం సొంత నియోజకవర్గంలోనే జగన్ ప్రకటించడంతో, అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయినా కేంద్రం పరిధిలో ఈ రిజర్వేషన్ అంశం ఉంటుందని, కేంద్రం ఇస్తాను అంటే తనకు అభ్యంతరం లేదంటూ, జగన్ చెప్పారు. కానీ ఎక్కడా, ముద్రగడను అవమానించే విధంగా జగన్ వ్యవహరించలేదు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో అధికారాన్ని చేపట్టింది. జగన్ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే కాపు కార్పొరేషన్ కు భారీగా నిధులను పెంచారు.

 

అంతేకాదు, కాపు మహిళలకు కాపు నేస్తం పేరుతో పథకాన్ని పెట్టి, వారి బ్యాంక్ అకౌంట్ లో సొమ్ము జమ చేశారు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించి విమర్శలు చేసింది. కాపులకు కావాల్సింది తాయిలాలు కాదని, రిజర్వేషన్లు అని జనసేన అధినేత పవన్ సైతం విమర్శించారు. దీంతో ముద్రగడ పద్మనాభం కూడా లైన్ లోకి వచ్చి జగన్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా జగన్ ను పొగుడుతూ, విమర్శిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం కరోనా వ్యవహారం ముగిసిన తర్వాత కాపు రిజర్వేషన్ అంశం పై మళ్లీ ఉద్యమం చేపట్టే దిశగా ముద్రగడ కసరత్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఈ వ్యవహారంలో జనసేన పార్టీ కూడా ఉద్యమించాలని చేస్తుండడంతో ముద్రగడ ఈ నిర్ణయానికి వచ్చినట్లు గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: