తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్నాడు. ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచినా, ఆ పార్టీ ఈ విధానాలను ఏవి పాటించకుండా, గెలిచిన దగ్గర నుంచి పవన్ కు అసహనాన్ని కలిగిస్తూనే ఉన్నట్టు గా కనిపిస్తున్నాడు. మొదట్లో జనసేన పార్టీ తరఫున యాక్టివ్ గా కనిపించినా, ఆ తర్వాత, ఆ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని భావించో,  వైసిపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించొ, తెలియదు కానీ, పూర్తిగా జనసేన పార్టీ వైసీపీ నాయకులతో కలిసి తిరగడం, ఏపీ సీఎం జగన్ ను పొగుడుతూ మాట్లాడడం జనసేనకు ఆగ్రహం కలిగిస్తోంది.

 

IHG

 

ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వదిలి పెట్టేసారు. పవన్ పైన కానీ, జనసేన పార్టీ పైన కానీ, రాపాక ఎంత ఘాటుగా విమర్శలు చేసినా, ఆయనపై చర్యలు తీసుకునేందుకు జనసేన పార్టీ వెనకంజ వేస్తూనే ఉంది.ఇదే అదునుగా రాపాక స్వతంత్రంగా వ్యవహరిస్తూ, జనసేనను మరింతగా కవ్విస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే, నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితి ఇలాగే ఉంది.

IHG

 

ఆయన వైసీపీ నుంచి గెలిచి ఇప్పుడు ఆ పార్టీ పైన అనేక విమర్శలు చేస్తూ, అసలు పార్టీకి తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, చెబుతూ హడావుడి చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరకుండానే వైసీపీపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నా, అధికార పార్టీకి పడడం లేదు. రాపాక విషయంలో జనసేన పార్టీ ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కుంటుందో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలోనూ అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరహా రాజకీయాలు ముందు ముందు చాలా చూడాల్సి వస్తుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: