2019 ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలలో ఒక కారణం జన్మభూమి కమిటీలు అని రాజకీయ విశ్లేషకులు అంటారు. ఇప్పుడు ఇదే విధంగా జగన్ తన ఆలోచన నుండి వచ్చిన వాలంటరీ వ్యవస్థ కూడా జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే చాలావరకూ తనకి ప్రభుత్వానికి వారధిలా వాలంటీర్లను జగన్ వాడుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమమైనా సంక్షేమ పథకమైనా దగ్గరుండి వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులను ఇంటికి తీసుకెళ్లే విధంగా జగన్ వాలంటీర్లను వాడుకుంటున్నరు.  

 

చాలా వరకు ప్రజలలో మరియు పార్టీ లలో వాలంటీర్ల వ్యవస్థ జగన్ సైన్యం అనే ముద్ర పడిపోయింది. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికలలో జగన్ గెలవడానికి వ్యూహాలు పన్నినా ప్రశాంతి కిషోర్ త్వరలో ఏపీకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ తో పాటు తన టీం గత ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితనం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు చేయడంతో వాళ్లను ఎమ్మెల్యే మనుషులు చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. గౌరవంగా ఎక్కడ మర్యాదలు తగ్గకుండా చూసుకునేవారు.

 

ఇటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితనం పై సర్వే చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా గ్రామ వాలంటీర్ లను ప్రశాంతి కిషోర్ టీం సభ్యులతో జగన్ కొన్ని పార్టీ కి సంబంధించిన కార్యక్రమాల కోసం పనిచేయించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ప్రజలు వాలంటీర్ల వ్యవస్థను మరో జన్మభూమి కమిటీలు భావిస్తారని జగన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్ విని తెగ భయపడిపోతున్నారు. ఇలా అయితే వైసీపీ ప్రభుత్వం పై చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాధం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: