అమరావతి నే ఏకైక రాజధానిగా చేయాలని రాజధానిలో చేస్తున్న నిరసనలు ఆందోళన కార్యక్రమలు రెండు వందల రోజుకు చేరుకుంది. దీంతో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో అదే విధంగా ఇతర దేశాలలో అమరావతి ని సపోర్ట్ చేసే మద్దతుదారులు 200 రోజు కనుక భారీ ఎత్తున నిరసన ప్రభుత్వానికి తెలిసేలా కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు. ఇతర దేశాలలో ఉన్న ఎన్నారైలు అమరావతి ని సపోర్ట్ చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా రాజధాని ప్రాంతంలో అమరావతి సపోర్ట్ చేస్తూ ఆందోళన చేస్తున్న వారు కూడా ఇక్కడ అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులు అనే సరికొత్త కాన్సెప్ట్ తెరపైకి తీసుకు రావడంతో అమరావతి ప్రాంతానికి భూములు ఇచ్చిన ప్రజల గుండెల్లో బాంబు వేసినట్లయింది.

 

దాదాపు 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు ప్రభుత్వానికి అప్పట్లో 30 వేల ఎకరాలు ఏపీ రాజధాని కోసం దారాదత్తం చేయడం జరిగింది. మూడు పంటలు పండే భూమి ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వటంతో ఇళ్లస్థలాలు రూపంలో ప్రభుత్వం వారికి కేటాయించడానికి అప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఓడిపోయాక జగన్ వచ్చాక మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో బిల్ పాస్ చేయటంతో రాజధాని ప్రాంత రైతులు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. శాసనమండలిలో రాజధాని బిల్లు తరలింపు కాకపోవటంతో ప్రజెంట్ ఆగిపోయిన రాబోయే రోజుల్లో కచ్చితంగా బిల్ పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

 

ఇటువంటి నేపధ్యంలో కొన్ని వేల ఎకరాలు ప్రజలు ప్రభుత్వానికి ఇవ్వటంతో వాళ్లు భూములను నష్టపోవడంతో వాళ్లంతా చేస్తున్న నిరసన దీక్షలు పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏమాత్రం కనికరం చూపించకుండా కనీసం నిరసన దీక్షలు చేస్తున్న వారి దగ్గరికి కూడా జగన్ ఇప్పటి దాక వెళ్లకపోవడం పై చాలామంది రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్ష పై జగన్ అంత మొండివైఖరి ప్రదర్శించకూడదు అని అంటున్నారు. వాళ్లకి సరైన రీతిలో ప్రభుత్వం యొక్క మూడు రాజధానులు ఉద్దేశం జగన్ స్వయంగా వెళ్లి చెబితే బాగుంటుంది అని కూడా సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: