ఏదైనా రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నారు అంటే ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలే పార్టీలో ఉన్న నేతలు అనుసరించాలి. కానీ బీజేపీలో పరిస్థితి వేరేగా ఉంది. 2014 ఎన్నికలలో ప్రధానిగా మోడీ ఎన్నికైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పార్టీ పరంగా అన్ని పనులను చక్కబెడుతూ రాణించడం జరిగింది. ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడ అమిత్ షా  తనదైన శైలిలో వ్యూహాలు వేస్తూ ప్రత్యర్థులను కంగారు పట్టించేవారు. ఇదే టైములో మోడీ కూడా తన ప్రసంగాలతో అలరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటూ చాలా చోట్ల బీజేపీ పార్టీ గెలిచేలా రాణించే వారు ఈ ఇద్దరు. కాగా ప్రధానిగా మోడీ రెండో సారి ఎన్నికైన తర్వాత కేంద్ర హోం శాఖ బాధ్యతలను అమిత్ షా చేతిలో మోడీ పెట్టడంతో పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ను నియమించడం జరిగింది.

 

ఇదిలాఉండగా జేపీ నడ్డా ని పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్న గాని పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో జేపీ నడ్డా పాత్ర ఏమీ లేదని బీజేపీ  పార్టీ లో వినిపిస్తున్న టాక్. చాలావరకు అమిత్ షా చెబుతున్న స్క్రిప్ట్ అధ్యక్షుడు పాత్రలో జేపీ నడ్డా అమలు చేస్తున్నట్లు, సొంతంగా పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏమి చేయలేకపోతున్నారని టాక్ వినబడుతోంది.

 

దీంతో చాలామంది బీజేపీ లో ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో సీటు ఆశించిన వాళ్ళు జేపీ నడ్డా ని సంప్రదించగా పెద్దగా పని జరగకపోవడంతో పాటుగా అమిత్ షా ఇచ్చిన రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ పై ఎంపిక చేసినట్లు సంతకాలు పెట్టడంతో టికెట్ ఆశించిన వాళ్ళు  అసలు ఈయన పనేంటి .. చేస్తోంది ఏంటి అని సెటైర్లు వేస్తున్నారట. కేవలం నామమాత్రంగానే కుర్చీలో జేపీ నడ్డా కూర్చోవడం జరిగిందని, మిగతా పనులు యధావిధిగా అమిత్ షా యే కట్టబెడుతున్నారని బీజేపీ పార్టీలో చర్చ గట్టిగా నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: