మనం ఈ లోకంలో ఎన్నో వింతలు చూస్తుంటాం. ఇంకా అలానే ఇది కూడా ఒక  వింత. ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి.. సాధారణంగా గబ్బిలాలు ఎలా ఉంటాయి. ఎలుకలా ఉంటాయి. వాటికీ రెక్కలు ఉంటాయి. కానీ కుక్కలా ఉండే గబ్బిలాలను ఎప్పుడైనా చూశారా ? అసలు అలాంటివి ఉంటాయి అని మీకు తెలుసా? 

 

ఏమో మరి.. చెట్లకు తలకిందులుగా వేలాడుతూ నిద్రపోయే ఈ గబ్బిలాలను చూస్తే మనకు భయం వేస్తుంది. కానీ చైనా వాళ్లకు ఈ గబ్బిలాలు ఎంతో ఇష్టమైనవి.. వీటి వల్లే కరోనా వీరులే పుట్టిందన్నా సంగతి తెలిసిందే. ఇంకా అలాంటి గబ్బిలాలు ఇప్పుడు ఎలుకల కాకుండా కుక్కలా ఉండే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

ఈ గబ్బిలం ముఖం చూస్తే కుక్కలాగా ఉంటుంది. ఇంకా దానికి రెక్కలు ఉన్నాయి. అయితే ఈ గబ్బిలం నల్లగా లేదు.. గోధుము రంగులో ఉంది. @emotionalpedant అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన ఈ గబ్బిలం ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అయితే ఇది కూడా గబ్బిలాల్లో ఒక రకం. దీన్ని బ్యూటికోఫెరీ ఎపాలెట్ ఫ్రూట్ బ్యాట్ అని అంటారట.

 

ఈ గబ్బిలం చూసి అసలు భయపడాల్సిన అవసరం లేదు.. శరీరం గోదుమ, తెలుపు రంగులో ఉంటుంది. దీని తల సాధారణ గబ్బిలాలు కంటే పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ గబ్బిలాన్ని ఎవరైనా చూస్తే ఏంటి కుక్కకు రెక్కలు కట్టారు అన్ని అడుగుతారు. అలాంటి గబ్బిలం ఇది. మరి మీరు కూడా ఈ గబ్బిలాన్ని ఓ సారి చూసేయండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: