2020 సంవత్సరంలో ఇప్పటికే మూడు గ్రహణాలు సంభవించగా నేడు నాలుగో గ్రహణం సంభవించనుంది. ఇప్పటికే ఈ ఏడాదిలో చంద్రగ్రహణం రెండుసార్లు, సూర్యగ్రహణం ఒకసారి ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరిలో తొలిసారి చంద్రగ్రహణం ఏర్పడగా.... గత నెల 5న మరోసారి చంద్రగ్రహణం వచ్చింది. అయితే ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణం ప్రపంచంలోని అన్ని దేశాలలో కనిపించదు. 
 
ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లోని దేశాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో చంద్రుడి పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ గ్రహణం ఉదయం 8.38 గంటల నుంచి 11.21 గంటల వరకు ఉంటుంది. ఆయా ప్రాంతాలను బట్టి గ్రహణ సమయాల్లో సైతం మార్పులు ఉంటాయి. గ్రహణం మొత్తం 2 గంటల 43 నిమిషాల 24 సెకన్ల పాటు ఉంటుంది. చంద్రగ్రహణం వల్ల కొందరికి సానుకూల ఫలితాలు కొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. 
 
గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకుడని పండితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో భూమీ ఆకర్షణ, వికర్షణ బలాల వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని చాలామంది భావిస్తారు. ప్రతి ఒక్కరూ నేడు గ్రహణం యొక్క నియమాలను పాటిస్తే మంచిది. ఈ గ్రహణం ధనస్సు రాశి వాళ్లకు గొప్ప ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ రాశితో పాటు గ్రహణం ప్రభావం కర్కాటక రాశి, సింహ రాశి, కన్య రాశిలపై ఉంటుంది. 
 
ఈ రాశుల వాళ్లు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోవడం వల్ల గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని పండితులు చెబుతున్నారు. మన దేశంలో ఈ గ్రహణం కనిపించకపోవడం వల్లే అలా జరుగుతుందని చెబుతున్నారు. గురు పూర్ణిమ పండుగ రోజునే చంద్ర గ్రహణం ఏర్పడనుండటం గమనార్హం.               

మరింత సమాచారం తెలుసుకోండి: