భయం మనిషిలోని వివేచనను చంపేస్తుంది.. ఆలోచనను నశింపజేస్తుంది.. మూర్ఖులుగా మార్చేస్తోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా భయం మనుషులను మానవత్వం లేకుండా చేస్తోంది. అన్ని మతాల్లోనూ మనిషి అంత్యక్రియలకుఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని చివరిసారి చూసేందుకు బంధువులంతా తప్పనిసరిగా వస్తారు.

 

 

ఆయా మతాలను బట్టి అంత్యక్రియలు జరుగుతాయి. కానీ.. కరోనాతో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారిని తమ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేయనివ్వడం లేదు. జనం తిరగబడి ధర్నాలు కూడా చేస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మృతదేహాల నుంచి కరోనా వ్యాపించదని నిపుణులు చెబుతున్నా జనం పట్టించుకునే స్థితిలో లేరు.

 

 

వాస్తవానికి కరోనా రోగులు మరణిస్తే 6 గంటల తర్వాత మృతదేహంలో వైరస్‌ ఉండదని నిపుణలు చెబుతున్నారు. అయితే.. మృతదేహాల నుంచి వెలువడే స్రావాలు ఒంట్లోకి వెళ్తేనే వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే మృతదేహాల విషయంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు పాటిస్తే ఎలాంటి వైరస్ వ్యాప్తి ఉండదు. దహనం చేసినప్పుడు వెలువడే పొగ నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదు. ఒకవేళ మృతదేహాన్ని భూమిలో ఐదారు అడుగుల లోపల సమాధి చేస్తే వైరస్ వ్యాపించే అవకాశమే లేదు.

 

 

కానీ.. నివాస ప్రాంతాలకు దగ్గర్లో కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేస్తే, ఆ వైరస్‌ ఇతరులకూ సోకుతుందనే అపోహలు జనంలో బాగా ఉన్నాయి. మృతదేహాలను దహనం చేసినప్పుడు వచ్చే పొగ, ఆ ప్రాంతం నుంచి వచ్చే గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని కూడా భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: