తెలంగాణలో కరోనా కేసులు వేలల్లో వస్తున్నాయి. రోజురోజుకూ ఈ సంఖ్య దారుణంగా పెరుగుతోంది. ఇక హైదరాబాద్ సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఓ గుడ్ న్యూస్ తెలంగాణ ప్రజలకు ఊరట కలిగిస్తోంది. అదేంటంటే.. తెలంగాణలో వ్యాపించే వైరస్‌లో 90 శాతం కరోనాలోని a2a  తరహా వైరస్ అని నిపుణలు చెబుతున్నారు. 


అదేంటి.. కరోనా వైరస్ లో కూడా రకాలు ఉన్నాయా అంటారా.. అవును.. ఉన్నాయి.. కరోనా వైరస్ అనేక రకాలుగా మార్పులు చెందుతోంది. ప్రధానంగా కరోనాలో ఇప్పుడు రెండు రకాల వైరస్‌లో వ్యాపిస్తున్నాయి.  ఇప్పటి వరకు తెలంగాణలో లక్షణాలు వెంటనే కనిపించే a 3 i వైరస్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించని a2a  వైరస్ 90శాతం విస్తరించింది. ఈ విషయాన్ని ప్రఖ్యాత సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. 


అంటే ఈ a2a  వైరస్ వస్తే.. అసలు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించవు. కరోనా వచ్చినట్టు వచ్చిన వ్యక్తికి తెలియనే తెలియదు. అంటే ఇది అంత ప్రమాదకరంగా కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించదు. కాబట్టి తెలంగాణ ప్రజలు కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. 


అయితే ఈ వైరస్ తో ఇంకో ముప్పు కూడా ఉంది. ఇదే వైరస్.. ఇప్పటికే అనారోగ్యం బారిన పడిన వారికి వ్యాపిస్తే మాత్రం వారికి ముప్పు కలిగించే అవకాశం ఉంది. అందువల్ల ఈ కరోనా వైరస్ బారి నుంచి పెద్దవారు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లక్షణాలు కనిపించడని ఈ వైరస్ గురించి తెలిసిన తర్వాత.. తమకు కూడా కరోనా వచ్చి, వెళ్లిపోయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అలా వచ్చి వెళ్లినా ఆ విషయం సదరు వ్యక్తులకు తెలిసే అవకాశం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: