భారతదేశంతో చైనా కయ్యానికి కాలుదువుతున్న విషయం తెలిసిందే.. ఇండియా, అమెరికాతో సత్సంబంధాలు పెంచుకోవడం ఇష్టంలేక భారత్ పై కుట్రలు పన్నుతుంది.. ఒకగానొక దశలో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించింది కూడా.. అలా అనుకున్నట్లుగానే గల్వ‌ాన్ లోయ‌లో మన సైనికులపై దాడికి తెగబడింది.. ఇదిలా ఉండగా చైనా విషయంలో సైనిక‌ నిఘా విభాగం మాజీ అధిప‌తి, విశ్రాంత జ‌న‌ర‌ల్ అమ‌ర్‌జీత్ బేదీ కొన్ని అభిప్రాయాలు వెల్లడించారు..

 

 

అదేమంటే గల్వ‌ాన్ లోయ‌లో చైనా చ‌ర్య‌ల‌పై ముందుగానే భార‌త్ సైన్యానికి నిఘా విభాగం నుంచి హెచ్చ‌రిక‌లు అందుండాల్సింది.. అంతే కాదు చైనా అనుస‌రించిన దూకుడు విధానాలు, భార‌తీయ సైనికుల‌ను దారుణంగా హ‌త‌మార్చిన తీరును గ‌మ‌నిస్తే.. ఈ దాడి పక్కా ప్ర‌ణాళిక‌ ప్ర‌కారం జ‌రిగిన‌ట్లు అనిపిస్తోంద‌ని బేదీ వెల్లడించారు..

 

 

అదీగాక చైనా దీని కోసం చాలా కాలం ముందే ప్రణాళిక‌లు సిద్ధంచేసి ఉండొచ్చు. అదీ బ‌హుశా మార్చి, ఏప్రిల్‌ నెలల ముందు నుంచే ఈ దాడి కోసం సిద్ధ‌మ‌వుతూ ఉండవచ్చు అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి సమయంలో మన సైన్యానికి ఎందుకు నిఘా స‌మాచారం అంద‌లేదో స‌మ‌గ్ర విచార‌ణ జరిపి తెలుసుకోవాలి.. ఈ విచార‌ణ సైన్యంతోపాటు ఇత‌ర నిఘా సంస్థ‌ల్లోనూ నిర్వ‌హించాలి. కార్గిల్ యుద్ధం త‌ర్వాత కూడా ఇలాంటి విచార‌ణ కోసం ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు అని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఈ సంక్షోభం ముగిసిన వెంట‌నే ఈ పక్రియను ప్రారంభించాలి అని ఆయ‌న అన్నారు..

 

 

ఇక మ‌న వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర‌చుకోవ‌డం భ‌విష్య‌త్తుకు చాలా అవ‌స‌రం కాబట్టి ఆ దిశగా మన ఆలోచనలు సాగాలి.. ఇదిలా ఉండగా గల్వ‌ాన్ లోయ‌లో దాడిని ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన దాడిగా భార‌త విదేశాంగ శాఖ కూడా పేర్కొందన్న విషయం తెలిసిందే.. ఇకపోతే నమ్మించి నట్టేట ముంచడం చైనాకు వెన్నతో పెట్టిన విద్యగా గత చైనా చరిత్ర గమనిస్తే తెలుస్తుందని తెలిపారు.. అయితే ఇదివ‌ర‌కు కుదిరిన ఒప్పందాల ప్ర‌కారం చైనా న‌డుచుకుంటుంద‌ని భావించాం. కానీ అలా జ‌ర‌గ‌లేదు అని బేదీ అన్నారు..

 

 

అదీగాక మౌలిక పెట్టుబ‌డులు, సైనిక విన్యాసాలు ఇత‌ర అసాధార‌ణ చ‌ర్య‌ల‌కు సంబంధించి చైనాలో జ‌రుగుతున్న అన్ని చ‌ర్య‌ల‌పై స‌మాచారం ఉంది. అయితే మార్చి నాటికి చైనా సైనికులు యుద్ధ విన్యాసాలు చేస్తున్న‌ట్లు కొన్ని సంకేతాలు వ‌చ్చాయి. ఆ విష‌యాన్ని మేం ఇత‌ర విభాగాల‌కు తెలియ‌జేశాం ఒకవేళ అప్పుడే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే ఈ నష్టం కూడా జరిగి ఉండకపోయేదని అభిప్రాయపడ్డారు..

 

 

ఇక చైనా కొంత‌కాలంగా త‌న సైనిక సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తోంది. భార‌త్‌తో పోలిస్తే.. చైనా ద‌గ్గ‌ర నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉప‌గ్రహాలున్నాయి. భార‌త్ కంటే చైనా ముందుంద‌ని దీన్నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే మ‌నం కూడా ఏం తక్కువగా లేము.. మన భార‌త్ కూడా కొంత‌కాలంగా త‌న‌ సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తోంది కానీ, అనుకున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు అని బేదీ వివ‌రించారు. ఇకపోతే భార‌త్ సైనిక‌ నిఘా విభాగం అధిప‌తిగా మార్చి వ‌ర‌కు బేదీ ప‌నిచేశారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: