జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పలేనంత క్రేజ్ వుంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టి సరైన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో విఫలమైన కారణంగానే ఆయన ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అది కాకుండా మొదటి నుంచి ఆయన చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకునే మనిషిగా గుర్తింపు పొందారు. ఈ కారణంగానే కూడా పవన్ కు రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మొదటి నుంచి వైసిపి అధినేత సీఎం జగన్ ను విమర్శిస్తూనే వస్తూ ఉండటం , తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తుండడం, ఇవన్నీ జనాల్లోకి బాగా వెళ్ళిపోయాయి. 
 
 
ఈ కారణంగానే పవన్ పై అనుమానాలు ఏర్పడడం,  అన్నీ జరిగిపోయాయి అయినా పవన్ పెద్దగా మార్పు వచ్చినట్టుగా కనిపించలేదు. ఇప్పటికీ ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజా సంక్షేమ పథకాలను పవన్ విమర్శిస్తూనే వస్తున్నారు. దీంతో జనాల్లో మంచి చేసినా, చెడు చేసినా, పవన్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అభిప్రాయం బలంగా వెళ్ళిపోయింది. ఈ పరిణామాలు జనసేన వర్గాల్లో కూడా అసహనం కలిగిస్తున్నాయి. మంచి చేసినప్పుడు మంచి అని, చెడు చేసినప్పుడు చెడు అని ఒప్పుకోకపోతే సగటు రాజకీయ నాయకులకు పవన్ కు తేడా ఏముంటుంది అనేది ప్రజల అభిప్రాయం.తాజాగా ఈ కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజల ఆరోగ్యాలను వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని వెయ్యికి పైగా కొత్త అంబులెన్స్ సర్వీసులను సరికొత్త సౌకర్యాలతో  జగన్ ప్రవేశపెట్టారు.
 
 
 ప్రస్తుతం ఈ సమయంలో అంబులెన్స్ ల అవసరం చాలానే ఉంటుంది. వీటి దృశ్య జగన్ ఈ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించింది. జాతీయ మీడియా కూడా జగన్ ను ప్రశంసించింది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు నిర్ధారణలో  ఏపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముందంజలో ఉండడంతో ఆ విషయంలోనూ జగన్ దేశవ్యాప్తంగా రాజకీయాలకతీతంగా అందరూ పొగుడుతున్నారు. ఈ సమయంలో తాను స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవడం తో పాటు, జనసేన పై చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఆలోచన తో పవన్ ఈ విధంగా జగన్ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ఊహించని విధంగా స్పందన రావడంతో ఇకపై రాజకీయాలను సరికొత్త రీతిలో నడిపించాలని పవన్ డిసైడ్ అయ్యారట. జగన్ పూర్తిగా శత్రువుల చూసే కంటే ఆయన చేసిన మంచి పనులను ప్రశంసిస్తే జనసేనకు జనాలను ఆదరణ పెరుగుతుందని, దానిద్వారా తెలుగుదేశం తొలగిపోతుందని అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: