ప్రపంచంలో మనిషి ప్రయాణం ప్రమాదం అంచులో సాగుతూ ఉంది. కానీ తనకు ఏ ప్రమాదం లేదనే భ్రమలో మానవుడు జీవిస్తున్నాడు.. నిత్యం ఏదో ఒక రూపంలో ఈ ప్రమాదం మన పక్కనే ఉన్న గుర్తించలేం.. ఇకపోతే మానవునికి ఎంతగానో ఉపయోగపడుతున్న జంతువుల నుండి ఎంత ప్రమాదం పోంచి ఉందో గ్రహిస్తే భయం వేస్తుంది.. కానీ ప్రాచీన కాలం నుంచి జంతువులతో మానవుని సహచర్యం కొనసాగుతూనే ఉంది. ఇలా ఏదో ఒక విషయంలో మనిషి పశు పక్షాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నాడు..

 

 

అదీగాక దాదాపుగా ప్రతి వారు తమతో పాటుగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా కుక్కను చూసుకుంటారు.. ఈ పెంపుడు కుక్కను మించిన విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి ఉండదని కూడా చెబుతుంటారు. అయితే ఇలా జంతువులతో చేసే ఈ సహచర్యంలో కొన్ని వ్యాధులు వాటి నుండి మనుషులకు తెలియకనే సంక్రమిస్తున్నాయి. అందులో స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, రేబిస్, హెచ్‌ఐవీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కూడా జంతువుల నుంచే మానవులకు సంక్రమించింది. మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

 

ఇక ప్రస్తుతం ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ వైద్యం లేని పరిస్థితి ఉంది.. ఇకపోతే జంతువుల నుంచి మనుషులకు, వారి నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకుతాయని నిపుణులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట జరిగిన సంఘటనను గమనిస్తే ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో జబ్బు చేసిన మేకను తినడం వల్ల ఆంత్రాక్స్‌ ప్రబలిన విషయం తెలిసిందే. బర్డ్‌ఫ్లూ సైతం దేశంలో పలు ప్రాంతాల వ్యక్తులను వణికించిందే. అడవి గబ్బిలం ద్వారా సోకే నిఫా వైరస్‌ కేరళలో 10 జూన్‌ 2018లో బయటపడి ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.

 

 

ఇలా ఇంకా ఎన్నో వ్యాధులు మన చుట్టూ ఉండే జంతువులు, పక్షుల వల్ల మనుషులకు వ్యాపిస్తాయి.. అందులో ప్రస్తుతం కరోనా సమయంలో ఎంతగా ముద్దు చేస్తున్న జంతువులను, పక్షులను అయినా కాస్త దూరం పెట్టడం మంచిదంటున్నారు వైద్యులు.. ఇక కొందరైతే పెంపుడు కుక్కలు లేనిదే నిదురపోరు.. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: