కరోనా అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి బాధని పడలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కరోనా వల్ల ఏ ఒత్తిడి లేకుండా ఉండండి. అలానే అనేక మార్గాల ద్వారా మీ రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకోవచ్చు. అయితే ఈ  రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలంటే...? దీనిని పూర్తిగా చదివేయండి.

 

రోగ నిరోధక శక్తిని  పెంచుకోవాలి అంటే తరచుగా నిమ్మకాయని వాడండి. నిమ్మకాయలో  ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి. నిమ్మకాయ నుంచి నిమ్మ తొక్క వరకు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ బి, విటమిన్ సి నిమ్మ లో ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా క్యాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా పుష్కలంగా ఇందులో ఉంటాయి దీని వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఆయుర్వేదం తో పాటు పలు ఔషధాలలో కూడా నిమ్మని అందుకే ఉపయోగిస్తారు నిమ్మని సకల రోగ నివారిణి అని కూడా అంటారు.

 

నిమ్మరసం కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. నోటి పూతకు నిమ్మ మంచి ఔషధం. జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్లా చేసుకుని కూడా తాగవచ్చు.  జీర్ణక్రియ వ్యాధులైన అజీర్ణం మొదలైన వాటిని తొలగించడానికి నిమ్మ సహాయ పడుతుంది.  నిమ్మలో సిట్రిక్ యాసిడ్ కడుపులో నొప్పి చెడుని తొలగిస్తుంది. కొబ్బరి నీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి లభించి నీరసంగా ఉన్నప్పుడు సహాయ పడుతుంది.  

 

అలానే నిమ్మ గజ్జి తామర చుండ్రు మొటిమలు వంటి చర్మ వ్యాధులను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మ వల్ల కాలేయం కూడా శుభ్రంగా మారుతుంది. చూసారు కదా నిమ్మ  వల్ల ప్రయోజనాలు రోజూ మీ డైట్ లో నిమ్మని చేర్చండి. ఆరోగ్యంగా ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: