దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని చూసి షాక్ అవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంతవుతోంది. కరోనా వైరస్ గురించి చేస్తున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ సోకిందో లేదో ఈ లక్షణం ద్వారా తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 
 
చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా సోకిందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ కరోనా రోగుల్లో ఆయాసం ఎక్కువగా ఉంటుందని... కొంత దూరం నడిస్తే కరోనా రోగుల్లో ఆయాసం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తూ ఉంటే వాళ్లు పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కరోనా రోగులు వంద అడుగులు నడిస్తే వారికి ఊపిరాడని పరిస్థితి వస్తుంది. 
 
కరోనా రోగులకు ఆయాసం వస్తే శరీరంపై ఏదో బరువు పెట్టిన భావనకు లోనవుతారని.... కొంతమంది వైరస్ వల్ల ఆయాసం ఎక్కువై చనిపోయారని వైద్యులు చెబుతున్నారు. సమయానికి ఆక్సిజన్ సిలిండర్ సెట్ చేస్తే మాత్రమే వీళ్లు వైరస్ నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరోనా సోకిన వాళ్లు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని... లేకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,850 మంది వైరస్ భారీన పడ్డారు. 613 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. దేశంలో దాదాపు 4 లక్షల మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: