క‌రోనా వైర‌స్.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్నారు. కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి క‌రోనా ప్ర‌పంచ‌దేశాల్లోనూ రోజురోజుకీ వేగంగా విస్తరిస్తోంది. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను విధిస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా బాధితుల సంఖ్య మ‌రియు మృతుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతోంది. ఇప్ప‌టికే 1,13,82,890 పాజిటీవ్ కేసులు నమోదుకాగా, 5,33,474 మంది మృతి చెందారు. ఇక ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా దాని తీవ్రత తగ్గుముఖం పట్టలేదు.

 

అయితే కొంద‌రు త‌మ‌కు క‌రోనా సోకింద‌ని చెప్ప‌కుండా దాచేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల మ‌రిన్ని పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే తాజా పరిశోధన ప్ర‌కారం.. ఎవరికైనా కరోనా వస్తే... దాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధార‌ణంగా  కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు మామూలుగా వచ్చేవే అని అనుకున్నా... ఆయాసం మాత్రం కరోనా పేషెంట్లకు అత్యంత ఎక్కువగా ఉంటోంద‌ట‌. 

 

ఈ ల‌క్ష‌ణాన్ని ఎవ్వ‌రూ దాచిపెట్ట‌లేర‌ట‌. అందుకే ఎవరైనా టెస్టు చేయించుకోవడానికి వస్తే... ఓ వంద అడుగులు నడవమని డాక్ట‌ర్లు చెబుతున్నార‌ట‌. ఒక‌వేళ వారికి క‌రోనా ఉంటే వంద అడుగులు నడిచాక.. ఊపిరాడని పరిస్థితి వస్తుంది. అదే మామూలు జ్వరాలు వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితి ఉండద‌ట‌. తద్వారా వారికి కరోనా వచ్చిన విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మ‌రియు ఆయాసం వ‌చ్చిన స‌మ‌యంలో వారికి ఆక్సిజన్ సిలిండర్ ఖ‌చ్చితంగా సెట్ చెయ్యాల‌ట‌. లేక‌పోతే చ‌నిపోయే ప్ర‌మాదం ఎక్కువ‌ని అంటున్నారు. అంతేకాదు, క‌రోనా వ‌చ్చినా చాలా మంది ఇళ్లలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. తీరా ఆయాసం పెరిగిపోయాక ఆస్పత్రికి వెళ్తూ.. మధ్యలోనే చనిపోతున్న ఘటనలు ఎక్కువ‌గా జరుగుతున్నాయ‌ట‌. కాబ‌ట్టి, క‌రోనా సోకితే దాచుకోవ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.


 

  

మరింత సమాచారం తెలుసుకోండి: