కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. కరోనా వైరస్ పేరు వినగానే మొదట మనకు చైనా దేశం గుర్తొస్తుంది. చైనా దేశంలోని వుహాన్ లో బయటపడ్డ ఈ వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అయితే వుహాన్ నగరంలోకి కరోనా వైరస్ ఎలా వచ్చిందనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పటికే వైరస్ పై అనేక కథనాలు, అనుమానాలు ఉన్నాయి. 
 
గబ్బిలాల నుంచి వచ్చిన వైరస్ ఇది అని చాలామంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2019 డిసెంబర్ నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ వైరస్ 2012లోనే బయటపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ అప్పట్లో ఈ వైరస్ ను ఎవరూ గుర్తించలేదని.... దాని తీవ్రత కూడా పెద్దగా లేదని.... 2012 వ సంవత్సరంలో నైరుతి చైనాలో ఓ రాగి గని నుంచి ఈ వైరస్ బయటపడి ఉండవచ్చని పరిశోధకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
2012లో మూసి ఉన్న ఒక రాగి గనిలో చీకటిగా ఉన్న ప్రాంతం కావడంతో సహజంగానే గబ్బిలాలు నివాసం ఏర్పరచుకున్నాయి. అయితే, గని తెరిచి ఉన్న సమయంలో చాలామంది కార్మికులు ఏదో ఒక రోగంతో మరణిస్తూ ఉండేవారు. వాళ్లు ఎందుకు మరణించేవారో ఎవరికీ అర్థం అయ్యేది కాదు. ఎందుకు అలా జరిగిందో అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు. గని మూసేసిన తర్వాత లోపలికి వెళ్లిన కార్మికులు కూడా న్యూమోనియా లాంటి వ్యాధితో మృతి చెందారు. 
 
ఆ గనిలో ఏముందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన శాస్త్రవేత్తలు గనిలో బండరాళ్లను పక్కకు జరిపి అక్కడి నుంచి అనేక నమూనాలను సేకరించారు. 2012 నుంచి ఆ గని నుంచి వేలాది శాంపిల్స్ ను సేకరించి వుహాన్ లోని ల్యాబ్ కు తరలించారు. ఆ శాంపిల్స్ లోనే కరోనా వైరస్ బయటపడినట్టు టైమ్స్ యూకే తెలిపింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: