ఒక పక్క అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఉద్యమాన్ని మరింత హీటెక్కించే ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా, ఈ వ్యవహారంలో బిజెపి ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని విశాఖ కు తరలించకుండా అమరావతికే పరిమితం చేయాలనే ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుండగా, ఇదే సమయంలో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేసి అమరావతి ఉద్యమానికి చెక్ పెట్టడంతో పాటు, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టే విధంగా జగన్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. 
 
IHG
 
ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతి వైపు మొగ్గు చూపించేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఇప్పటికే అన్ని విధాల అభివృద్ధి చెందిన విశాఖలో అయితే, ఆర్థికంగానూ కాస్త ఊరట చెందవచ్చనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది. అసలే ఇది కరోనా సమయం కాబట్టి,  ఆర్థికంగా ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం అసాధ్యమని, అందుకే పరిపాలన రాజధానిగా విశాఖ వైపు మొగ్గు చూపుతున్నామనే విషయాన్ని కేంద్రంతో పాటు ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు అనే  అభిప్రాయంతో జగన్ ఉన్నారు.అందుకే అతి తొందరలోనే విశాఖ లో రాజధాని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పరిపాలన రాజధానికి అవసరమైన బిల్డింగులను, ప్రభుత్వ ఉద్యోగులు ఉండేందుకు నివాసాలను వెతికే పనిలో నిమగ్నమైంది. 
 
IHG
 
తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్  విశాఖ లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖకు సంబంధించిన కార్యాలయాల కోసం డిజిపి ఆరా తీసినట్లు తెలుస్తోంది. రిషికొండ, ఐటీ హిల్స్ 2 లో అనేక భవనాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా న్యూ నెట్ సంస్థకు చెందిన భారీ భవంతిని కూడా డిజిపి పరిశీలించి, అక్కడి సదుపాయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ బిల్డింగ్ పై మరో అంతస్తు నిర్మించుకునే అవకాశం ఉందా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తోట్ల కొండలో గ్రే హౌండ్స్  ఉన్న ప్రాంతాన్ని కూడా డిజిపి పరిశీలించినట్లు తెలుస్తోంది. జగన్నాధపురం వెళ్లి ప్రభుత్వం కేటాయించిన భూములను ఆయన పరిశీలించారు. అలాగే సింహపురి లేఅవుట్ వెనుక ఉన్న అటవీ భూములను పరిశీలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా  అటవీ అధికారులు డీజీపీ ని కలిసి భూములకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఏపీ ప్రభుత్వం అతి తొందర్లోనే విశాఖ నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: