2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీ పార్టీ భయంకరమైన కష్టాల లో మునిగి ఉంది. పార్టీలో ఉన్న కీలక నాయకులు వరుసగా అరెస్టు అవటంతో మరోపక్క పార్టీలో ఉన్న నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్న తరుణంలో పూర్తిగా తలనొప్పుల్లో మునిగిపోయారు చంద్రబాబు. ఇలాంటి తరుణంలో స్థానిక ఎన్నికలలో విజయవాడ మేయర్ పీఠం కోసం విజయవాడ ప్రాంతానికి చెందిన ఎంపీ మరియు ఎమ్మెల్యే మరింతగా చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారినట్లు పార్టీలో వినబడుతున్న టాక్. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె శ్వేత గత సార్వత్రిక ఎన్నికల టైంలో తండ్రి తరపున విజయవాడ ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించడం జరిగింది.

IHG's daughter as mayor candidate in ...

ఇదే తరుణంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సతీమణి అనురాధ ప్రస్తుతం మేయర్ అభ్యర్థి కోసం పోటీ పడుతున్నారట. ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య అనురాధ మధ్య విజయవాడ మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారట. మేయర్ అభ్యర్థిత్వం ఎవరికీ కేటాయించక ముందే చంద్రబాబు మాకు ఇచ్చాడు అంటూ ఎంపీ వర్గీయులు ప్రచారం చేసుకుంటూ ఉండగా లేదు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వర్గీయులు బాబు గారు మాకు కేటాయించారు అని విజయవాడ పరిధిలో ప్రచారం చేసుకుంటున్నారట.

IHG

దీంతో ఈ రెండు వర్గాల మధ్య తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు అధికమై చంద్రబాబుకి తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీని మరియు ఎమ్మెల్యేలు ఇద్దరిని దగ్గరకు పిలిపించుకొని నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: