కరోనా సమయంలో దేశంలో చాలా రోజులు లక్డ్ డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. గుళ్లు గోపురాలు కూడా పూర్తిగా మూసివేశారు. చాలా రోజులు దేవాలయాలు అన్ని మూతబడ్డాయి. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని సడలింపులతో దేవాలయాలు తెరవబడ్డాయి. అప్పటినుంచి దేవాలయాలకు భక్తుల రాకపోకలు పెరిగాయి. అయితే ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఓ గురుద్వార్ లో అపశృతి చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి తన తల్లి మరణానంతరం జరిపిన ప్రార్థనా కార్యక్రమంలో లోని ప్రసాదాన్ని ఆ గురు ద్వార్ వద్దకు తీసుకెళ్లి అక్కడ భక్తులకు పంచిపెట్టారు. ఆ ప్రసాదం తిన్న కిద్దిసేపటికీ కొంతమంది అస్వస్థతకు గురయ్యారు..


వివరాల్లోకి వెళ్తే... . వివరాల్లోకి వెళ్తే ..పంజాబ్కు చెందిన రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవలే మరణించారు. అయితే శనివారం రఘువీర్ సింగ్ తన ఇంటిలో సుఖ్మాణి సాహిబ్ ప్రార్థనా కార్యక్రమం  నిర్వహించారు. ఈ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇంట్లో అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. మిగిలిన ప్రసాదాన్ని తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లి అక్కడున్న భక్తులకు ఈ పంచిపెట్టారు. భక్తులకు ఎంతో సంతోషంగా ప్రసాదాన్ని పంచిపెట్టారు.  అయితే ఈ ప్రసాదం తిన్న వెంటనే 10 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారందరిని అమృత్సర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిలో  ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.


అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రసాదం తిన్న వారందరూ ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదు దీంతో అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రసాదాన్ని తీసుకెళ్తుండగా మార్గ మద్యంలో ఏదైనా జరిగిఉండొచ్చని అంటున్నారు. దీంతో గురుద్వారాకు తీసుకెళ్లిన ప్రసాదంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కాగా తన తల్లి మనసాంతి కోసం ప్రార్థనా కార్యక్రమం చేసి అందరికి ప్రసాదం పంచిపెడితే ఇలా జరగడం ఏంటని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన కు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: