కరోనా వైరస్ గురించి ప్రభుత్వం జనాలకు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా చాలా మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు. అరికట్టాల్సినది వ్యాధిని గాని రోగిని కాదు అంటూ ప్రభుత్వాలు ప్రచారాలు చేస్తున్నా మరొక పక్క వ్యాధిగ్రస్తులను చాలా దారుణంగా వెళ్లి వేసే విధంగా సమాజం చూస్తోంది. సరిగ్గా ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో అక్కాతమ్ముళ్ల కు కరోనా లక్షణాలు ఉన్నాయి ఏమో అనే అనుమానంతో ఊరంతా కలిసి వాళ్ళిద్దరినీ ఊరి బయట ఉండే ఓ పాఠశాల గదిలో బంధించారు.

 

రెండు వారాల పాటు బయటకు రాకుండా అక్కడే ఉండాలని గ్రామస్తులంతా స్కూల్ బయట వాళ్ళు ఊర్లోకి రాకుండా కూడా కాపలాగా ఉంటున్నారు అంట. పూర్తి వివరాల్లోకి వెళితే...భిక్కనూరు మండలం జంగంపల్లిలో సుధారాణి తన కుటుంబంంతో కలిసి నివసిస్తోంది. ఆమె కూతురుకి ఇటీవల ప్రసవం జరిగింది. దీంతో కూతురిని చూసేందుకు తల్లి సుధారాణి సోదరుడు రాకేశ్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే అనుకోకుండా పుట్టిన బిడ్డకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ విషయం తెలియకపోవడంతో వీరిద్దరూ ఆమె వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.

 

వాళ్లు ఊరిలోకి రాకుండా ఊరి పొలిమేర వద్ద వారిని అడ్డుకుని పాఠశాల గదిలో బంధించడం జరిగింది. ఈ ఘటనతో మనస్థాపానికి గురైన వాళ్ళిద్దరూ...సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ బాధని తెలియజేశారు. వైరస్ భయం కంటే గ్రామస్తులు మాట్లాడుతున్న మాటలు మానసిక వేధింపులకు గురి చేస్తున్నాయని చనిపోయేలా ఉన్నామని బాధితులు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే నెటిజన్లు ఏమి భయపడకండి అంటూ వారికి మద్దతు తెలిపారు. ధైర్యం చెబుతూ వారిని విడిపించడానికి వీడియో ని సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: