తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోతోంది. కరోనా చికిత్సకు తొలి నుంచీ  కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఇప్పుడు రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే గాంధీ ఆస్పత్రి పేరు చెబితేనే... భయపడే రీతిలో ప్రచారంసాగుతోంది. అయితే ఇది అసత్య ప్రచారమని, రోగులకు తాము ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నామని వైద్యులు అంటున్నారు. రోగులకు అందిస్తున్న చికిత్సా విధానంపై వివరణ ఇచ్చింది గాంధీ ఆస్పత్రి.  

 

తెలంగాణలో కరోనా చికిత్సకు  కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి. రాష్ట్రంలో తొలి కేసు నమోదుకాక ముందే...కరోనా చికిత్సకు గాంధీలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వైరస్ లక్షణాలు కనిపించినా..రోగం బారిన పడినా...అందరూ గాంధీకే పరుగులు తీశారు. కరోనా కలిగించే భయం కన్నా....గాంధీ ఆస్పత్రి ఉందన్న ధైర్యం రాష్ట్ర ప్రజల్లో...ఎక్కువగా ఉండేదనడం అతి శయోక్తి కాదు. ఐసొలేషన్ బెడ్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం, చికిత్సతోపాటు కౌన్సెలింగ్ ఇస్తూ...భయాందోళన తొలిగించే డాక్టర్లు...ఇలా చెప్పుకుంటూ పోతే...గాంధీ ఆస్పత్రిలో మహమ్మారికి అందించిన వైద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.

 

కరోనా తమను ఏం చేస్తోందోనన్న భయంతో, అనుమానంతో ఆస్పత్రికి వెళ్లిన వారంతా...పదిహేను  రోజుల తర్వాత... ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. కరోనాకు సంబంధించినంతవరకూ గాంధీ ఆస్పత్రి అంటే ఓ భరోసా. కరోనాకు మందు లేకపోయినా...గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందితే చాలు..క్షేమంగా ఇంటికెళ్లగలమని అందరూ నమ్మేవారు. కానీ ఇది నెలన్నర క్రితం పరిస్థితి. ఇప్పుడు మాత్రం గాంధీ ఆస్పత్రి గురించి సోషల్ మీడియాలోనూ, బయటా పూర్తిగా దీనికి భిన్నమైన ప్రచారం జరుగుతోంది. అది గమనిస్తే...గాంధీ ఆస్పత్రి పేరు చెబితే కరోనా రోగులే కాదు..సాధారణ జనాలే బెంబేలెత్తిపోతారు. కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరిన వారికి చికిత్స అందడం లేదని, వైద్యం అందక ఎందరో చనిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మృతదేహాల తారుమారు వంటి ఘటనలు కూడా గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. ఇక వైద్యం అందించడం లేదని ఆరోపిస్తూ...జూనియర్ డాక్టర్ల బాధితుల బంధువులు దాడులు చేసిన ఘటనలపైనా వాట్సప్ వీడియోలు చక్కర్లు కొట్టాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: