దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల సంబంధ బాంధవ్యాలు పూర్తిగా సమసిపోతున్నాయి. కరోనా వచ్చిందంటే చాలు సహాయం చేయడానికి ఎవరూ రావడం లేదు సరికదా ఏదో పాపం చేసిన వారిలా భావిస్తున్నారు.  అయితే కరోనాని క్వారంటైన్ లో ఉండి తగ్గించుకున్న వారు ఉన్నారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకి ఇరవై వేల కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ రాలేదు. 

 

ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,44,814 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అయితే కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అటు వైద్యులను, వైద్య సిబ్బందిని, ఇటు పోలీసులను వేటాడుతోంది. వారిని కూడా బలి తీసుకుంటోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.  కరోనా సోకి ఎవరైనా తెలిసినవారు మరణిస్తే చివరి చూపులకు కూడా వెళ్లడం లేదు. కరోనా వైరస్ తో మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి కూడా భయపడిపోతున్నారు.  కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు పూర్తిగా కలకుండానే స్మశానం నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. దీంతో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. 

 

గాంధీ ఆసుపత్రిలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు. దీని పర్యవేక్షణ కోసం జీహెచ్‌ఎంసీ ముగ్గురు సిబ్బందిని అక్కడ నియమించింది.  శనివారం తన తాత అస్థికల కోసం శ్మశానవాటికకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటం చూశాడు.   ఇలా శ్మశానవాటికకు వచ్చిన మృతదేహాలు పూర్తిగా కాలే వరకు బాధ్యతలు విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: