కేంద్రంలో మంత్రివర్గం ఏర్పాటు అయి ఏడాది పై దాటింది. ఈలోగా పనిమంతులు ఎవరు బుధ్ధిమంతులు ఎవరు అన్న లెక్కలు అంచనాలు ప్రధాని మోడీకి బాగా తెలిసాయి. ఇచ్చిన శాఖకు న్యాయం చేసేవారిని జాగ్రత్తగా చూసుకుంటూనే పనిచేయనివారిని ఇంటికి పంపడమో, మరో శాఖకు బదిలీ చేయడమో చేసేందుకు మోడీ తన  మంత్రి వర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు.

 

రాజ్యసభలో బీజేపీకి కొత్త సభ్యులు వచ్చారు. దాంతో అక్కడా ఇక్కడా చూసుకుంటూ ఆశావహులను, సమర్ధులను తీసుకోవాలని మోడీ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ రోజు హఠాత్తుగా మోడీ రాష్ట్రపతిని కలసి వచ్చారు. రాం నాధ్ కోవింద్ తో అనేక విషయాలు చర్చించారు. అందులో కేంద్ర మంత్రి వర్గం విస్తరణ కూడా ఉందని అంటున్నారు.

 

మోడీ ద్రుష్టిలో అర్జంటుగా దేశానికి ఆర్ధిక మందు వేసే వారు కావాలి. అంటే ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ని తప్పించి వేరే వారికి పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇక నిర్మలమ్మకు వేరే శాఖను ఇస్తారని అంటున్నారు. అదే విధంగా ఆర్హ్దిక నిపుణుడిని ఒకరిని తెచ్చి ఆర్ధిక శాఖను అప్పగించాలని కూడా మోడీ భావిస్తున్నారుట. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు మన్మొహన్ సింగ్ ని తెచ్చిపెట్టారు. ఇపుడు మోడీ అలాంటి ప్రయోగమే చేయనున్నారుట.

 

ఇక ఏపీ నుంచి కూడా ఒకరిని మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని మోడీ రెడీ అయ్యారని అంటున్నారు. ఆ ఒక్కరూ ఎవరో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇన్నాళ్ళూ సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపించేది ఎపుడైతే ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ తో బీజేపీకి ఇబ్బందులు తెచ్చారో నాటి నుంచి ఆయన ప్రాధాన్యత కొంత తగ్గిందని అంటున్నారు. ఇస్తే గిస్తే టీజీ వెంకటేష్ కి చాన్స్ రావచ్చు. లేకపోతే కడపకు చెందిన వెలమ నేత సీఎం రమేష్ కి ఒక అవకాశం ఉంటుంది. అంటున్నారు. మొత్తానికి ఏపీ నుంచి ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: