కరోనా వైరస్ వల్ల మొన్నటివరకు అమెరికా తెగ వణికిపోయింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో భయంకరంగా మరణాలు సంభవించడం తో పాటు వైరస్ పాజిటివ్ కేసులు రావటంతో అరికట్టడానికి డోనాల్డ్ ట్రంప్ అనేక ఇబ్బందులు, విమర్శలు  ఎదుర్కొన్నారు. ఏ మాత్రం రాజకీయ నేపథ్యం లేని డోనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  డోనాల్డ్ ట్రంప్  అమెరికా అధ్యక్షుడు ఇలా అయ్యాడో లేదో అమెరికాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ప్రెసిడెంట్ గా బరాక్ ఒబామా పాస్ చేసిన చాలా బిల్లులు పక్కన పెట్టడం జరిగింది. ‘అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే స్లోగన్ తో ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన డోనాల్డ్ ట్రంప్… అధికారంలోకి వచ్చాక చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ రావటంతో అమెరికాలో బయంకరంగా మరణాలు పాజిటివ్ కేసులు బయటపడటంతో డోనాల్డ్ ట్రంప్ నాయకత్వం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. చైనా వైరస్ అని సంబోధిస్తూ కరోనా వైరస్ ని ముందు లో ట్రంప్ చాలా లైట్ గా తీసుకున్నారు. ఇది పెద్ద భయపడాల్సిన వైరస్ కాదని, కరోనా విషయంలో ట్రంప్ కామెంట్లు చేయటంతో అమెరికన్లు వైరస్ ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చల్లని ప్రదేశం కావడంతో కరోనా వైరస్ భయంకరంగా అమెరికాలో వ్యాప్తి చెందింది. భయంకరమైన మరణాలు సంభవించడం తో ఆర్థికంగా గాను మనిషి ప్రాణాల పరంగానూ భారీ మూల్యం ట్రంప్ చెల్లించుకున్న పరిస్థితి దేశంలో ఏర్పడింది.

 

ఇటువంటి తరుణంలో అమెరికా ఎన్నికలు నవంబర్ లో జరుగబోతున్న క్రమంలో నాయకులు కరోనాపై దృష్టి పెట్టకుండా ఎన్నికల గెలుపు పైనే దృష్టి పెడుతున్నారట. దీంతో ప్రజెంట్ పరిస్థితి మళ్లీ ఫస్ట్ లో ఉన్న విధంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా వణికిపోతున్నారు. పట్టించుకునే నాయకుడే లేడని ఎలక్షన్ గోల తప్ప ఇంకేమీ లేదని లబోదిబోమంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: