ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఏపీ సీఎం జగన్ అంటే ఎంత కసి, కోపమో కొత్తగా చెప్పనక్కర్లేదు.  ఆయన తన రాతల్లో ఎప్పుడూ జగన్ పై అనంతమైన కోపం ప్రకటిస్తూ ఉంటారు. అయితే రాధాకృష్ణ తన తాజాగ కొత్త పలుకులో ఈసారి మరింతగా రెచ్చిపోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ పై బురద చల్లేశారు. దాన్ని బురద జల్లడం అనడం కంటే.. మనసులో దుగ్ద బయటపెట్టుకోవడం అంటే బెటరేమో. 

 


ఇంతకీ రాధాకృష్ణ ఏమంటారంటే.. అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ అండ్‌ కోకు న్యాయశాస్త్రంలోని లొసుగులపై పూర్తి అవగాహన ఏర్పడిందట. కాలికి వేస్తే మెడకు.. మెడకు వేస్తే కాలికి తగులుకునేలా రకరకాల పిటిషన్లు దాఖలు చేస్తూ దశాబ్దం గడుస్తున్నా కేసులు విచారణకు రాకుండా అడ్డుకోగల నైపుణ్యాన్ని జగన్‌ అండ్‌ కో సొంతం చేసుకోగలిగిందట. పలు అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. 

 


అంతే కాదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులను జగన్ అవపోసన పట్టారు కనుకే న్యాయ వ్యవస్థతో ఢీకొనడానికై తమ్మినేని సీతారాం, హన్స్‌రాజ్‌ వంటి వారిని ఎంచుకుని ఉంటారన్న అభిప్రాయం ఉందంటూ విమర్శించారు. అంటే.. కోర్టుల్లో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే మాత్రం న్యాయవ్యవస్థ చాలా మంచిదన్న మాట.. ధర్మాన్ని కాపాడటానికి న్యాయవ్యవస్థ అంటూ ఒకటి ఉందని సదరు ఆర్కేకు గుర్తొస్తుందన్నమాట. 

 


మరి అదే న్యాయ వ్యవస్థను ఆశ్రయించే కదా.. జగన్ కూడా బెయిల్ తెచ్చుకున్నది. కానీ జగన్ కు బెయిల్ ఇస్తే మాత్రం న్యాయవ్యవస్థలో లొసుగులు ఉన్నట్టుగా సదరు ఆర్కేకు తోస్తుందన్నమాట. అంటే జగన్ కు మంచి జరిగితే అది న్యాయవ్యవస్థ లోపం అన్నమాట. జగన్ కు వ్యతిరేకంగా తీర్పువస్తే అది న్యాయవ్యవస్థ గొప్పదనం అన్నమాట. వారెవా.. ఆర్కే గారూ.. ఏమి సెప్పితిరి.. ఏమి సెప్పితిరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: