తెలంగాణలో కరోనా పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా తయారవుతోంది. దేశంలోనే తక్కువ టెస్టులు చేయిస్తున్న రాష్ట్రం అంటూ విపక్షాలు విమర్శిస్తున్నా... కేసులు మాత్రం గణనీయంగానే వెలుగు చూస్తున్నాయి. చేయించే తక్కువ టెస్టులకే ఇన్ని కేసులు వస్తే.. పక్కాగా టెస్టులు చేస్తే.. ఇంకా భారీగా కేసులు బయటపడతాయన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెలుగు దిన పత్రిక తెలంగాణలో కరోనా పరిస్థితిపై సంచలనాత్మక కథనం ప్రచురించింది. 

 

IHG


తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి టెస్టులు, ట్రేసింగ్ విషయంలో నిరక్ష్ల్యంగా వ్యవహరించిందంటూ గణాంకాలతో వివరించింది. జూన్ 15 నాటికి రాష్ట్రంలో 43,180 టెస్టులు చేస్తే.. 5,193 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపిన వెలుగు.. జూన్ 16 నుంచి టెస్టుల సంఖ్యను పెంచారని రాసింది. ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు అనుమతించడంతో టెస్టుల సంఖ్య పెండంతోనే అసలు లెక్క బయటకొచ్చిందని వివరించింది. 

 


కరోనా టెస్టుల విషయంలో సర్కార్ నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తే.. ట్రేసింగ్ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వెలుగు రాసుకొచ్చింది. టెస్టుల కోసం బాధితులే వెళ్లి ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల వద్ద లైన్లు కడుతుంటే..  టోకెన్లు అయిపోయాయని శాంపిల్ సెంటర్ల వద్ద ఉన్న సిబ్బంది, బాధితులను వెనక్కి పంపుతున్నారని తెలిపింది. మరోవైపు  రాష్ట్రంలోకి వైరస్ ఎంటరై 4 నెలలు దాటినా గాంధీ హాస్పిటల్ తప్ప మరో ప్రభుత్వ దవాఖానలో కరోనా ట్రీట్‌‌మెంట్ స్టార్ట్ చేయలేదని విమర్శించింది. 

 


తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్న పత్రికలే కేసీఆర్ కు వ్యతిరేకంగా రాయలేక.. ఆహో ఓహో అంటూ నయవంచన చేసుకుంటుంటే.. వెలుగు దిన పత్రిక మాత్రం ధైర్యంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించింది. అయితే వెలుగు దినపత్రిక యజమాని బీజేపీలో చేరినందువల్లే ఈ రేంజ్‌లో కథనాలు రాస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: