జగన్ బ్రహ్మాండమైన మెజారిటీతో అదికారంలోకి వచ్చారు. ఆయన్ని జనం చాలా గొప్పగా ఆదరించారు. ఆయనకు 86 శాతం సీట్లు, 50 శాతం పైగా ఓట్ల షేర్ దక్కడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఇక ఏడాది పాలనను జగన్ పూర్తి చేసుకున్నారు. అన్ని వర్గాలకు హామీలను తీరుస్తూ తాను ఇచ్చిన తొంబై శాతం హామీలను నెరవేర్చారు. రెండవ ఏడాది పాలన ఇపుడు సాగుతోంది. 

 

మరి జగన్ గద్దె  దిగిపోతారని, మాజీ అయిపోతారని టీడీపీ ఒకటే ఊదరగొడుతోంది. ఎపుడో ఒకసారి అంటే ఏమో రాజకీయ విమర్శ అనుకోవచ్చు కానీ పదే పదే అనడం బట్టి చూస్తూంటే మాత్రం దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అని అనిపించకమానదు. మాజీ ఎంపీ సబ్బం హరి గత ఏడాదిగా ఇప్పటికి పలుమార్లు జగన్ గద్దె దిగిపోతారు అంటూ జోస్యాలు చెబుతూ వచ్చారు. తాజాగా ఆయన మరోసారి జగన్ ఈ ఏడాదిలోగా జగన్ అధికారంలో ఉండరు అంటున్నారు.

 

ఇక ఈమధ్యనే మహానాడు వేళ సినీ నటుడు, ఎమ్మెల్యే బాబు బావమరిది కూడా అయిన  బాలక్రిష్ణ కూడా వైసీపీ అధికారం మూణ్ణాళ్ల ముచ్చటేనని చెప్పుకొచ్చారు. ఇలాగే పలువురు నాయకులు తరచూ జగన్ గద్దె దిగిపోతారని అంటున్నారు. మరి దీని వెనక మతలబు ఏంటి ఏమైనా కుట్ర ఉందా అన్న చర్చ వైసీపీలో వస్తోంది.

 

దీని మీద మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే కుట్ర చేస్తున్నారా అంటూ టీడీపీని గట్టిగానే నిలదీశారు. చంద్రబాబుకు ఇలాంటి వాటిలో అనుభవం ఉందని ఆయన కుట్రలు చేస్తే మాత్రం ఊరుకోమని కూడా హెచ్చరించారు. ఇక సబ్బం హరి టీడీపీ అధినాయకుడిగా మాట్లాడుతున్నారని, ఆయన చెప్పేదేంటి జోస్యం అని కూడా కడిగిపారేశారు. మొత్తానికి టీడీపీ వైపున   కుట్ర జరుగుతోంది అంటూ వైసీపీ మంత్రి అన్నారంటే దీన్ని సీనియస్ గానే తీసుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: