నానాటికి భారతదేశంలో కరోనా కేసులు ఏ విధంగా నమోదవుతున్నాయో ప్రత్యక్షంగా రోజువారి లెక్కల ద్వారా తెలుసుకుంటున్నాం. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే కొందరు మాత్రం ప్రభుత్వాల సూచన వినకొండ ఇష్టానుసారం చేస్తూ చివరికి కరోనా బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారు మాత్రమే కాకుండా వారితో కలిసి జీవించే వారిని, అలాగే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

IHG



ఇకపోతే తాజాగా వైద్యులు తెలిపిన సమాచారం మేరకు.. డి-విటమిన్ లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారినపడి మృతి చెందుతున్నారని తెలిసింది. శరీరంలో డి విటమిన్ పుష్కలంగా ఉన్న వారికి ఒకవేళ కరోనా సోకినా వారు త్వరగానే కోరుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇది ముఖ్యంగా నగరవాసుల్లో ఏకంగా 80 శాతం వరకు డి-విటమిన్ లోపం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి.

IHG



ఇకపోతే దేశంలో ముఖ్యంగా మహానగరాల్లో ఉండే వారే ఎక్కువ కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుండటం మనం గమనిస్తున్న విషయం. డి విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, అది తక్కువగా ఉండే వారి ఆరోగ్యం సన్నగిల్లుతుందని తాజాగా హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి తెలిపారు. ఇకపోతే కరోనా మృతులలో అధిక శాతం విటమిన్ డి లోపం ఉన్న వారని రిపోర్టుల ప్రకారం అర్థమవుతోంది. కాబట్టి విటమిన్-డి లభించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని, కరోనా బారినపడకుండా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: