కరోనా కేసుల సంఖ్య ఓవైపు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,850 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 613 మంది మృతువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. ఇందులో 2,44,814 యాక్టివ్ కేసులు కాగా, 4,09,083 మంది పూర్తిగా కోలుకున్నారు.  కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా  4,09,083కి పెరిగింది. ఇక కరోనా   . దేశంలో ఇప్పటి వరకు 97,89,066 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.   పేషెంట్ల రికవరీ 60.80 శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో అసోంలోని మూడు గ్రామాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. నాగాన్ జిల్లాలో ఇస్లాం మత బోధకుడి అంత్యక్రియలకు శనివారంనాడు వేలాది మంది జనం హాజరుకావడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.

 

ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. జన సమూహం ఉండకూడదని.. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని చెప్పినా.. అక్కడి గ్రామస్థులు మాత్రం లెక్కచేయకుండా గుంపులు గుంపులు గా వచ్చారు. ఆల్ ఇండియా జమాయిత్ ఉలేమా అధ్యక్షుడు, ఈశాన్య ప్రాంత అమీర్-ఇ-షరియత్‌కు చెందిన 87 ఏళ్ల ఖైరుల్ ఇస్లాం అంత్యక్రియలు ఈనెల 2న జరిగాయి. నిజానికి జూలై 3న అంత్యక్రియల కోసం ఊరేగింపు జరపాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ ఆ తర్వాత 2వ తేదీనే అంత్యక్రియలకు నిర్ణయించారు. దీంతో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది జనం హాజరయ్యారు. 

 

దీనికి సంబంధించిన ఫోటోలో ఆయన తనయుడు ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో చుట్టపక్కల మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే ఇస్లాం ప్రవక్త అంత్యక్రియల్లో 10,000 మందికి పైగా హాజరై ఉంటారని పోలీసులు అంచనా వేశారు. రెండు పోలీసు కేసులు కూడా నమోదు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: