ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వైపు కరోనా వైరస్ విరుచుకుపడుతూ ఉంటే.. మరోవైపు అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీ మహానగరంలో ఇద్దరు హిజ్రాలు లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నం జరిగింది. హిజ్రాల దగ్గరకు బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఇక అదే సమయంలో అక్కడ ఒక కానిస్టేబుల్ నిందితులను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. దీనితో ఆ నిందితులు కానిస్టేబుల్ పై కూడా కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశారు.

 


వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ దుండగులను బైక్ నుంచి బలంగా నెట్టి వేయడంతో, ఇక అంతలోపే ఆ మార్గంలో వచ్చిన ఒక ఆటో లో వారు ఇద్దరూ దూరి అక్కడినుంచి పారి పోవడం జరిగింది. ఇక కానిస్టేబుల్ సమాచారం మేరకు మిగతా పోలీసు అధికారులు నిందుతులు పారిపోతున్న ప్రాంతాన్ని ఆటోను చెక్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హిజ్రాలను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ దారుణమైన సంఘటన ఢిల్లీ మహా నగరంలోని అంబేద్కర్ నగర్ లో జరిగింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళితే... గత ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో గణేష్ అనే హిజ్రా హత్య కు పాల్పడ్డాడు. ఇక ఈ హత్య కేసులో షాలు అనే మరో హిజ్రా నిందితురాలు. అలాగే షాలు స్నేహితురాలు  అలియా కు కూడా ఈ హత్య కేసులో సంబంధం ఉందని అప్పట్లో తేలింది. ఈ తరుణంలో గత సంవత్సరం హత్యకు గురైన గణేష్ స్నేహితురాలు పింకీ, ఆలయాలపై కక్ష పెంచుకుంది. అప్పటినుంచే వారిని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్న లోకేష్ కపిల్ అనే  ఇద్దరు వ్యక్తులకు  హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తరుణంలోనే నిందితులు ఇటీవల షాలు, అలియా హత్యకు ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. వారు పారిపోతున్న ఆటోలో వారిని పట్టుకొని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకుని వారి స్టైల్ లో విచారణ చేపట్టగా మొత్తం వివరాలు బయటకి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: