చైనా దూకుడుకు, పొగరుకు ఇపుడు ప్రపంచం మండిపోతోంది. కరోనా వైరస్ తరువాత యావత్తు జగత్తు కూడా యాంటీ డ్రాగన్ గా మారుతోంది. అయినా కూడా తెంపరితనంతో చైనా వీర విహారం చేస్తోంది. పైకి సోది కబుర్లు చెబుతూ అమాయకత్వం నటించే చైనా అసలు కధను లోకం బాగా తెలుసుకుంది. అందుకే ఇంత పెద్ద దేశం అయినా కూడా నమ్మడంలేదు. పైగా పగతో రగులుతున్న దేశాలు సమయం చూసి పగ తీర్చుకోవాలనుకుంటున్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే చైనాకి మోడీ గట్టి ముహూర్తమే పెట్టారని అంటున్నారు. సరిహద్దుల దాకా వెళ్ళి చైనాకు తిరుగులేని హెచ్చరికను జారీ చేసిన మోడీ ఇపుడు తదుపరి కార్యక్రమానికి కూడా రెడీ అవుతున్నారని చెబుతున్నారు. హఠాత్తుగా ఆయన రాష్ట్రపతిభవన్ కి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి కలిశారు. ఆయన‌తో చాలా విషయాలు మాట్లాడారు.

 

అందులో రెండు రోజుల క్రితమే లడక్ దాకా వెళ్ళి వచ్చిన విషయాన్ని చైనా దూకుడుని కూడా వివరించారని అంటున్నారు. త్రివిధ దళాలకూ అధిపతి అయిన రాష్ట్రపతికి దేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా మోడీ వివరించారని అంటున్నారు. ఒకవేళ చైనాతో యుధ్ధమే కనుక వస్తే దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్న మోడీ ఆ మాటను కూడా రాష్ట్రపతి చెవిన వేసి ఉంటారని అంటున్నారు.

 

ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడాన్ని కూడా ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. దేశానికి ఇంటా బయటా పెను సమస్యలు ఎదురవుతున్నాయని కూడా వెంకయ్య అభిప్రాయపడ్డారు.

 

ఆయన సైతం చైనా దూకుడు, సవాళ్ళను ద్రుష్టిలో పెట్టుకుని ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే వార్నింగులతో  డ్రాగన్ దారికి రాదని మోడీ సైతం భావిస్తున్నారు అంటున్నారు. అందువల్ల చిన్నదో పెద్దదో యుధ్ధం ఒకటి జరుగుతుందని అభిప్ర‌యం మాత్రం దేశంలోపలా, బయటా  అంతటా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: