దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసే యోచనలో కేంద్రం లేదు. 25,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ పల్లెలకూ వేగంగా వ్యాపిస్తోంది. 
 
దేశంలో విద్యా రంగంపై ఈ వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ విద్యా సంవత్సరం అసలు మొదలవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా విద్యార్థులు పాఠాలు అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 40 శాతం మంది విద్యార్థుల ఇంట్లో స్మార్ట్ ఫోన్లు లేవు. కొంతమంది విద్యార్థుల ఇంట్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నా ఇంటర్ నెట్ కనెక్షన్ లేదు. 
 
తాజా వాతావరణం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 - 2026 నాటికి దేశంలోని 4 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇందుకోసం 60,000 కోట్లు కేటాయించనుంది. ఇందులో 36,000 కోట్లు కేంద్రం భర్తిస్తుండగా మిగిలిన నగదు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 
 
శరవేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్రం కూడా మార్పులు చేస్తోంది. అత్యాధునిక విద్యా వ్యవస్థ దిశగా ముందడుగులు వేస్తోంది. యువత విద్యావ్యవస్థలో కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మారతారా లేదా చూడాల్సి ఉంది. ఆన్ లైన్ క్లాసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా ప్రపంచాన్ని ఎంత మారుస్తుందో చూడాల్సి ఉంది.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: